100కోట్ల బిజినెస్ దిశగా డర్టీ పిక్చర్
విద్యాబాలన్ నటించిన 'ద డర్టీ పిక్చర్' వంద కోట్ల బిజినెస్ దిశగా దూసుకెలుతోంది. ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే రూ. 65 కోట్ల వసూళ్లు సాధించింది. హిందీతో పాటు తెలగు, తమిళంలో కూడా రిలీజ్ అవ్వడం ఈ సినిమాకు కలిసొచ్చింది. దక్షిణాది ఒకప్పటి ఐటం సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కడంతో....స్మిత తెరవెనక జీవితం గురించి తెలుసుకోవడానికి క్యూ కడుతున్నారు ప్రేక్షకులు. దీనికి తోడు సినిమాపై నెలకొన్ని అనేక వివాదాలు డర్జీ పిక్చర్ కు ఫుల్లుగా పబ్లిసిటీ పెంచేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సినిమా బిజినెస్ పూర్తయ్యే నాటికి 100 కోట్ల మార్కు దాటుతుందని సినిమా వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఒక సాధారణ లోబడ్జెట్ చిత్రంగా వచ్చి వంద కోట్ల మార్కును దాటిన సినిమాగా డర్జీ పిక్చర్ రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విజయంతో బాలీవుడ్ 'ఎ' గ్రేడ్ హీరోయిన్ల సరసన చేసిన విద్యా బాలన్ రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసింది. ప్రస్తుతం ఈవిడను హీరోయిన్ గా బుక్ చేసుకోవాలంటూ రూ. 7 కోట్లు సమర్పించుకోవాల్సిందేనంట.


Click it and Unblock the Notifications











