పెద్దలకు మాత్రమే!: నేడే థియేటర్లలో డర్టీ పిక్చర్
విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ఏక్తాకపూర్ నిర్మించిన ది డర్టీ పిక్చర్ శుక్రవారం విడుదల కానుంది. కథ, కథనం ఏలా ఉన్నప్పటికీ సిల్క్ స్మిత జీవిత గాథ అనడంతో ఈ సినిమా భారీ క్రేజ్ సంపాదించుకుంది. దీంతో అందరి దృష్టి ఈ రోజు విడుదలయ్యే డర్టీ పిక్చర్ పైనే ఉంది. అయితే ఈ సినిమా ట్రయలర్స్ చూసినా మరే విధంగా చూసినా కుటుంబ సభ్యులతో చూసేది మాత్రం కాదని చెప్పవచ్చు. ఇప్పటికే సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎ సర్టిఫికేట్ జారీ చేసింది.
సిల్క్ స్మిత సోదరుడు నాగవర ప్రసాద్ హైకోర్టులో ఈ సినిమా నిలుపుదల చేయాలంటూ పిటిషన్ వేయడంతో నిన్నటి వరకు మన రాష్ట్రంలో విడుదలపై సస్పెన్స్ ఉండేది. అయితే హైకోర్టు ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. దీంతో మన రాష్ట్రంలోనూ ఈ చిత్రం ఈ రోజే (శుక్రవారం) విడుదల కానుంది. మరి సినిమా విడుదలకు ముందే అంతగా క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం రిజల్ట్ ఎలా ఉంటుందో మరి కొద్ది గంటలు ఆగితే తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











