పాత్రకు న్యాయం చేయడం కోసమే సెక్సీగా కనిపించాల్సి వస్తుంది తప్పా
'ఇప్పటి వరకూ పాత్ర కోసం మాత్రమే సెక్సీగా కనిపించాను. అంతే తప్ప... పాపులారిటీ కోసం అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయలేదు. చేయను కూడా"" అని నిఖ్ఖచ్చింతగా చెబుతున్నారు విద్యాబాలన్. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న 'డర్టీ పిక్చర్" చిత్రంలో విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే. పాత్ర రీత్యా ఆ సినిమాలో ఆమె గ్లామర్‌ను ఒకింత ఎక్కువగానే ఆరబోయాల్సి ఉంటుందంట. ఈ విషయం గురించి ఆమె ప్రస్తావిస్తూ పై విధంగా స్పందించారు.
ఈసందర్బంలో విద్యాబాలన్ మాట్లాడుతూ ''ఆ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడమే నా ముందున్న లక్ష్యం. ఈ సినిమాలో నేను టాప్‌లెస్‌గా కనిపించనున్నాననే వార్తలు మీడియాలో వచ్చాయి. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఈ మధ్య 'టాప్‌లెస్" అనే పదానికి అర్థాన్ని కూడా మార్చేస్తున్నారు కొందరు. టవల్ అడ్డం పెట్టుకొని, చేతులు అడ్డం పెట్టుకొని కనిపించడం టాప్ లెస్ ఎలా అవుతుంది. గతంలో ఓ మ్యాగజైన్ ఫొటో షూట్‌లో నేను అలాగే కనిపించాను.
కానీ 'విద్యాబాలన్ టాప్‌లెస్‌గా దర్శనమిచ్చింది" అంటూ... మీడియా ప్రచారం జరిగింది. ఇప్పుడు 'డర్టీ పిక్చర్" విషయంలో కూడా ఇలాంటివే మళ్లీ లేవనెత్తుతున్నారు. అందులో ఏ మాత్రం నిజంలేదు. హాలీవుడ్ హీరోయిన్లు డెరైక్ట్‌గా టాప్‌లెస్‌లోనే కెమెరా ముందుకొస్తారు. అసలు టాప్‌లెస్ అంటే అది. నా లైఫ్‌లో పొరపాటున కూడా నేను అలాంటి పని చేయను. అలాంటి అవసరమే వస్తే ఆ పాత్ర నుంచి తప్పుకుంటాను తప్ప అలాంటి పిచ్చిపని చేయను. దయచేసి నాపై ఇలాంటివి క్రియేట్ చేయొద్దని మీడియాకు మనవి చేసుకుంటున్నాను"" అంటూ తన భాదను మీడియా ముందు వెళ్శగక్కారు విద్యాబాలన్.


Click it and Unblock the Notifications











