Oscars 2023 ఆస్కార్‌ల్లో సత్తా చాటిన భారత్.. తొలి అవార్డు ఏ చిత్రానికంటే?
ఆస్కార్ 2023 అవార్డుల్లో భారతీయ సినిమా సత్తా చాటుతున్నది. ఆదివారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) జరిగిన వేడుకల్లో భారతీయ నిర్మాత గన్నీత్ మోంగా నిర్మించిన ది ఎలిఫెంట్ విస్పెరర్స్ షార్ట్ ఫిలింకు అవార్డు దక్కింది. ఈ చిత్రానికి కార్తికి గోన్సల్వేస్ దర్శకత్వం వహించారు. డౌగ్లస్ బ్లష్, కార్తీకి గోన్సల్వేస్, గన్‌పీత్ మోంగా, ఆచిన్ జైన్ నిర్మించారు.
దర్శక, నిర్మాత కార్తికి గోన్సల్వేస్ The Elephant Whisperers షార్ట్ ఫిలింను ఇండియన్, అమెరికన్ జాయింట్ వెంచర్‌తో షార్ట్ డాక్యుమెంటరీగా నిర్మించారు. శిఖ్యా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందింది.

The Elephant Whisperers షార్ట్ ఫిలిం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఓటీటీలో మంచి ప్రశంసలు, పలు అవార్డులను అందుకొన్న ఈ చిత్రం అకాడమీ అవార్డుల్లో ఉత్తమ డ్యాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం క్యాటగిరిలో అవార్డును అందుకొన్నది.
ఇప్పటికే ఈ షార్ట్ ఫిలిం డాక్ న్యూయార్క్ అవార్డును, హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డు, ఐడీఐ డాక్యుమెంటర్ీ అవార్డును అందుకొన్నది.


Click it and Unblock the Notifications











