Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
The Family Man 2: అభిమానులకు మరొక బ్యాడ్ న్యూస్.. చాలా తెలివిగా ప్లాన్ చేశారు..
ఆమెజాన్ ప్రైమ్ లో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న టాప్ వెబ్ సిరీస్ లలో ద ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. నేషనల్ వైడ్ గా దాదాపు అన్ని భాషల్లో కూడా ఈ వెబ్ కంటెంట్ కు మంచి ఆదరణ దక్కింది. ఇక సీజన్ 2 కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు దర్శకులు రాజ్ & డీకే తెరకెక్కించిన ఈ వెబ్ కంటెంట్ ట్రైలర్ బుధవారం 12 గంటలకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
అంచనాలకు తగ్గట్లుగానే
గత కొన్ని రొజులుగా ప్రమోషన్ అయితే బాగానే చేస్తున్నారు. మొదటి సీజన్ ను అన్ని భాషల్లో నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. మనోజ్ బాజ్‌పేయ్ , ప్రియమణి నటించిన సీజన్ 1 క్లిక్కవ్వడంతో రాజ్ అండ్ డీకే సెకండ్ సిజన్ లో సమంతను తీసుకువచ్చారు. సీజన్ 2ను అంచనాలకు తగ్గట్లుగానే రెడీ చేసినట్లు ప్రమోషన్ డోస్ కూడా పెంచుతున్నారు.
బోల్డ్ పాత్రలో సమంత..
సమంత తన కెరీర్ లోనే మొదటిసారి చేస్తున్న వెబ్ సిరీస్ ఇదే. ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసిన సమంత ఇప్పుడు ఒక ఉగ్రవాది పాత్రలో సరికొత్తగా కనిపించనుంది. పాత్ర డిజైనింగ్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని ఇంతకు ముందు ఈ స్థాయిలో బోల్డ్ పాత్రలో నటించలేదని దర్శకులు కూడా క్లారిటీ ఇచ్చేశారు.
అమెజాన్ తెలివైన ప్లాన్
అయితే ఈసారి అమెజాన్ ప్రైమ్ ఈ సీజన్ 2ను తెలివిగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది. ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 మొత్తం 10 ఎపిసోడ్స్ కాగా వాటన్నిటినీ కూడా ఒకేరోజు రిలీజ్ చేశారు. కానీ సీజన్ ఎపిసోడ్స్ ను మాత్రం అలా కాకుండా వారానికోక ఎపిసోడ్ ను విడుదల చేయనున్నారట. తప్పకుండా సీజన్ 2 క్లిక్కవుతుందని అమెజాన్ ప్రైమ్ గ్యాప్ లేకుండా ప్రమోషన్ డోస్ పెంచుతోంది.
Recommended Video
ఈ సిరీస్ హిట్టయితే..
ఇక రిలీజ్ డేట్ ను రేపు విడుదల చేయబోయే ట్రైలర్ లోనే చెప్పబోతున్నారు. దర్శకులు రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ పై చాలా నమ్మకంతో ఉన్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సిజన్ లోనే ఎక్కువగా ఉంటాయట. ఇక ఈ సిరీస్ హిట్టయితే రాజ్ అండ్ డీకే అంతకు మించి అనేలా భవిష్యత్తు ప్రాజెక్టులను ప్లాన్ చేస్తారట. తెలుగులో మహేష్ బాబు - విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ తో కూడా ఈ దర్శకద్వయం సినిమాలు చేయాలని అనుకుంటోంది.