twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The family man 2: అఫీషియల్ ట్రైలర్ తో సర్‌ప్రైజ్‌.. బోల్డ్ పాత్రలో సమంత

    |

    ఆమెజాన్ ప్రైమ్ లో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న టాప్ వెబ్ సిరీస్ లలో ద ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. తెలుగు దర్శకులు రాజ్ & డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ఈ వెబ్ కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. మనోజ్ బాజ్‌పేయ్ , ప్రియమణి నటించిన సీజన్ 1 కు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో సీజన్ 2ను అంచనాలను తగ్గట్లుగానే రెడీ చేస్తున్నారు.

    ఈసారి సరికొత్త పాత్రలో సమంత కూడా కనిపించనుంది. ఆమె పాత్ర నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని ఒక బోల్డ్ పాత్రలో నటించినట్లు దర్శకులు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 రిలీజ్ పై త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వబోతున్నారు. అది కూడా అద్భుతమైన ట్రైలర్ తోనే రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారు.

    The Family Man 2 Official Trailer with release date

    మే 19న ఈ వెబ్ కంటెంట్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. దర్శకులు రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ పై చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మొదటి సీజన్ కంటే కూడా సెకండ్ సీజన్ 2 లో సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా హై రేంజ్ లో ఉంటాయట. ఇక ఈ సిరీస్ హిట్టయితే రాజ్ అండ్ డీకే మరో బిగ్ బడ్జెట్ సినిమాతో రావాలని అనుకుంటున్నారు. ఇప్పటికే షారుక్ ఖాన్ కు ఒక కథ చెప్పారు. ఇక మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి హీరోలతో కూడా సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

    English summary
    The Family Man is one of the most viewed web series on Amazon Prime. Directed by Telugu directors Raj & DK, this web content has received a good response from audiences from all walks of life. Manoj Bajpayee and Priyamani starrer Season 2 is getting ready for season 2 with a huge response.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X