twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత ఫ్యాన్స్‌కు నిరాశ.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే!

    |

    వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమంత అక్కినేని ఫ్యాన్స్‌కి, ది ఫ్యామిలీ మ్యాన్ అభిమానులకు చేదు వార్త. ఫిబ్రవరి 12 అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న ఈ పాపులర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ను నిర్మాత, దర్శకులు వాయిదా వేసినట్టు ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించారు. అయితే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ వాయిదా ఎప్పుండంటే...

    ది ఫ్యామిలీ మ్యాన్‌ సూపర్ హిట్

    ది ఫ్యామిలీ మ్యాన్‌ సూపర్ హిట్

    అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రిలీజైన ది ఫ్యామిలీ మ్యాన్ తొలి సీజన్‌ భారీగా విజయవంతమైంది. మనోజ్ బాజ్‌పేయ్, ప్రియమణి తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్‌కు అన్ని భాషల్లో అనూహ్యమైన స్పందన లభించింది. దాంతో దాని సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.

    సమంత కీలక పాత్రతో ది ఫ్యామిలీ మ్యాన్ 2

    సమంత కీలక పాత్రతో ది ఫ్యామిలీ మ్యాన్ 2

    అనూహ్యమైన ప్రేక్షకాదరణను మూటగట్టుకొన్న ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌ను సరికొత్తగా అందించేందుకు నిర్మాత, దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ప్రయత్నాలు చేశారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత అక్కినేని తెరపైకి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టును మరింత ఆకర్షణీయంగా మార్చారు. ఈ వెబ్ సిరీస్‌లో సమంత ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

    ది ఫ్యామిలీ మ్యాన్ 2 వాయిదా అంటూ

    ది ఫ్యామిలీ మ్యాన్ 2 వాయిదా అంటూ

    అయితే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2ను ఫిబ్రవరి 12వ తేదిన రిలీజ్ చేయాలని రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే నిర్ణయించారు. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అధికారికంగా ప్రకటన చేశారు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్‌ను వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నమని యూనిట్ తెలియజేసింది. ఇన్స్‌టాగ్రామ్ ద్వారా ఈ వార్తను చేరవేయడంతో ప్రేక్షకులు కాస్త నిరాశకు గురయ్యారు.

    మీ ఆదరణకు రుణపడి ఉన్నాం

    మీ ఆదరణకు రుణపడి ఉన్నాం

    ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం మీరంత ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. మాపై మీరు చూపిస్తున్న ఆదరణకు ఎంతో రుణపడి ఉన్నాం. కానీ ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌ను ఫిబ్రవరి 12న కాకుండా వేసవిలో మీ ముందుకు తీసుకు రావాలని నిర్ణయించాం అని రాజ్, కృష్ణ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

    గొప్ప అనుభూతిని కలిగించేలా

    గొప్ప అనుభూతిని కలిగించేలా

    ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని ది ఫ్యామిలీ మ్యాన్‌ను మరింత ఆకర్షణీయంగా, గొప్ప అనుభూతిని కలిగించేలా.. ఓవరాల్‌‌గా సూపర్‌గా ఉండేలా చర్యలు తీసుకొంటున్నాం. తప్పకుండా మా ప్రయత్నాలు మిమల్ని మెప్పిస్తాయి. ఈ వెబ్ సిరీస్‌ను వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం అని రాజ్ నిడిమోలు, కృష్ణ డీకే తమ ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో వివరించారు.

    English summary
    The Family Man 2 release postponed on Amazon prime video. In fact, This popular web series release date was announced on Feb 12. Due to some technical reason, release date pushed to Summer 2021. In this occassion, Samantha Akkineni fans upset over.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X