For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  The Family Man 2 Twitter Review: వరల్డ్ క్లాస్ సిరీస్.. స్టన్నింగ్ పెర్ఫార్మర్.. నరాలు తెగిపోయేంత ఉత్కంఠ

  |

  అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ చిత్రంపై సెలబ్రిటీలు, నెటిజన్లు, అభిమానులు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. దర్శకులు నందినిరెడ్డితోపాటు పలువురు నెటిజన్లు ట్వీట్లతో అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

  సమంత నటన అద్బుతంగా

  సమంత నటన అద్బుతంగా

  ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత నటన అద్బుతంగా ఉంది. ఆమె పెర్ఫార్మెన్స్‌ను మాటల్లోనే చెప్పలేని పరిస్థితి. తెరపైన సమంత యాక్టింగ్ చూస్తే పిచ్చెక్కింది. ప్రతీ పాత్రకు తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకొంటూ ఊహకు అందని విధంగా నటనను ప్రదర్శిస్తున్నారు. నిజమైన సూపర్ స్టార్ అంటే సమంతనే. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అదిరోహించాలి అంటూ దర్శకురాలు నందినిరెడ్డి ట్వీట్ల వర్షం కురిపించారు.

  నరాలు తెగిపోయేంతగా యాక్షన్

  నరాలు తెగిపోయేంతగా యాక్షన్

  ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 చాలా రోజులు వెంటాడుతూనే ఉంటుందనేది నిజం. అద్భుతమైన వెబ్ సిరీస్. ఈ సిరీస్ గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. స్క్రిప్టు స్టన్నింగ్, సెన్సిటివ్, మంచి డ్రామా, కామెడీ, నరాలు తెగిపోయేంతగా యాక్షన్ సీన్లు. హృదయాన్ని తాకే ఎమోషన్స్ ఈ సిరీస్‌లో ఉన్నాయి అని నందిని రెడ్డి పేర్కొన్నారు.

  మనోజ్ బాజ్‌పేయ్ లెజెండ్ యాక్టర్

  మనోజ్ బాజ్‌పేయ్ లెజెండ్ యాక్టర్

  ది ఫ్యామిలీ మ్యాన్ విషయానికి వస్తే.. మనోజ్ బాజ్‌పేయ్ లెజెండ్ యాక్టర్ అని మరోసారి రుజువు చేసుకొన్నారు. సమంత కెరీర్‌లో కొత్త శకం మొదలైందని చెప్పవచ్చు. ప్రియమణి, షరీబ్ హష్మీ ఫెర్ఫార్మెన్స్ సూపర్‌గా ఉన్నాయి. ఇంకా ఎంతో మంది అద్భుతమైన నటను ప్రదర్శించారు అని నందినిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు.

  రాజ్ అండ్ డీకే వరల్డ్ క్లాస్

  రాజ్ అండ్ డీకే వరల్డ్ క్లాస్


  ఇక దర్శకులు రాజ్ అండ్ డీకే వరల్డ్ క్లాస్ సిరీస్‌ను రూపొందించారు. సినిమా నిర్మాణంలోను, స్క్రీన్ ప్లేలోను మీరు మాస్టర్ క్లాస్. కథ, కథనాలను అందించిన సపర్న్ ఎస్ వర్మ, సుమన్ కుమార్ ప్రతిభ ఎక్సెలెంట్. ఒక్క మాటలో చెప్పాలంటే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అమోఘం అంటూ నందిని రెడ్డి ట్వీట్ల వర్షం కురిపించారు.

  అపోహలను కాలరాసిన ఫ్యామిలీ మ్యాన్ 2

  ఇక నెటిజన్ల విషయానికి వస్తే.. సాధారణంగా వెబ్ సీరీస్‌కు సీక్వెల్ అంటే గొప్పగా ఉన్నట్టు కనిపించలేదు. కానీ ఫ్యామిలీ మ్యాన్ ఆ అపోహలను కాలరాసింది. నటీనటులు ఎంపిక, డైరెక్షన్, యాక్టింగ్, కామెడీ అన్నీ చక్కగా కుదిరాయి. పవర్ ప్యాక్ట్ సిరీస్, మూడో సీజన్ ప్రాజెక్ట్ గుయాన్ యో గురించి వేచి చూస్తున్నాం. బాజ్‌పేయ్ నటన సూపర్‌గా ఉంది అంటూ కామెంట్ చేశారు.

  నాలుగు ఎపిసోడ్స్ థ్రిల్లింగ్

  ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 చాలా నైస్‌గా ఉంది. మొదటి సీజన్ కంటే గొప్పగా రూపొందించారు. చివరి నాలుగు ఎపిసోడ్స్ థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. అద్భుతమైన నటనను ప్రదర్శించిన మనోజ్ బాజ్‌పేయ్‌కి కంగ్రాట్స్ అని తెలిపారు.

  లవ్ జిహద్ అనేది ముప్పు

  లవ్ జిహద్ అనేది దేశానికి చాలా ముప్పు అనే విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. లవ్ జిహద్ అనేది భ్రమ అనే వాళ్లకు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కనువిప్పుగా మారుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

  Rajamouli గురించి తెలిసే Mahesh Babu ఇలా | Mahesh Babu Rajamouli Movie || Filmibeat Telugu

  సమంత స్టన్నింగ్ పెర్ఫార్మర్

  సమంత గురించి ఎవరు ఎలాంటి అభిప్రాయం చెప్పినా పట్టించుకోను. ఆమె స్టన్నింగ్ పెర్ఫార్మర్. ఛాలెంజింగ్ ఉండే రోల్స్‌లో నటించే గట్స్ ఉన్న ఏకైక నటి. రాజీ పాత్ర కోసం చూపించిన అంకితభావం, ఆమె ఫిట్‌నెస్ అద్బుతం. సమంత రుత్ ప్రభు.. నీవు రుత్ లెస్ (దయలేని) అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

  English summary
  The Family Man 2 Twitter Review: The Family Man 2 web series released on Amazon prime video on June 4th. In this series, Manoj Bajpayee, Samantha Akkineni, Priyamani roles are well defined. In this occassion, Telugu filmibeat brings exclusive twitter review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X