For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  The Family Man Season 3: చైనా కరోనా కుట్రలపై వార్.. శ్రీకాంత్ తివారీకి పవర్‌ఫుల్ టాస్క్!

  |

  దర్శకులు రాజ్ అండ్ డీకే రూపొందించిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన సీజన్ 2 జూన్ 4వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కావడం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో సీజన్‌పై నెటిజన్లు, ప్రేక్షకులు భారీగా ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్ ముగింపులో మూడో సీజన్‌పై చిన్న టీజర్ వదిలి మరింత ఆసక్తిని రేపారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గురించిన వివరాల్లోకి వెళితే.. .

  ది ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్‌కు ప్లాన్

  ది ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్‌కు ప్లాన్

  ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్‌ అత్యంత ఎమోషనల్‌గా, ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఆసక్తికరంగా రూపుదిద్దుకొన్నది. సీజన్ 1కు సీక్వెల్‌గా వచ్చిన తాజా సీజన్‌లో సమంత మరింత ఆకర్షణగా మారారు. ఇక క్లైమాక్స్‌లో మూడో సీజన్‌పై చిన్న ఫీలర్ వదిలి మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు.

   కోల్‌కతాలోకి చొరబడిన చైనా దేశస్థుడు

  కోల్‌కతాలోకి చొరబడిన చైనా దేశస్థుడు

  ది ఫ్యామిలీ మ్యాన్ 2 క్లైమాక్స్ తర్వాత కోల్‌కతాలోకి చైనాలోకి ఓ వ్యక్తి ప్రవేశించడంతో టీజర్ మొదలైంది. ఇక ఇండియాలో కరోనావైరస్ వ్యాప్తికి చేస్తున్న కుట్రలను బహిర్గతం చేశారు. లాప్‌ట్యాప్‌లో చైనా దేశస్థుడు తన దేశానికి పంపే సందేశాలు భయాన్ని కలిగించేలా ఉన్నాయి. దీంతో మరో సీజన్ కరోనావైరస్ నేపథ్యంగా సాగుతుందనే విషయం అర్ధమైంది.

   చైనాకు ప్లాన్.. ఇండియాలో అమలు..

  చైనాకు ప్లాన్.. ఇండియాలో అమలు..

  కోల్‌కతాను బేస్‌గా చేసుకొని చైనా దేశస్థుడు.. ఈ దేశ ప్రజలు అల్లకల్లోలంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫోనిక్స్ తమ స్థానాల్లో ఉన్నారు. నాగాలాండ్‌లో ప్లాన్ అంతా సిద్ధమైంది. ఇంకా రెండు రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో ప్లాన్ రెడీ అవుతుంది. సెంట్రల్ కమాండ్ నుంచి ఎల్‌జెడ్స్ ఆమోదం ఉన్నది. ప్రాజెక్టు గువాన్ యూ అంతా పకడ్బందీగా కొనసాగించడానికి ప్లాన్ రెడీగా ఉంది అంటూ సందేశాలు పంపుతూ కరోనా కుట్రకు తెరతీసినట్టు కనిపించింది.

   చైనా కరోనా కుట్రలపై యుద్ధభేరి

  చైనా కరోనా కుట్రలపై యుద్ధభేరి

  ఇక దర్శకులు రాజ్ అండ్ డీకే.. తదుపరి సీజన్‌లో కరోనావైరస్ కుట్రలను ఛేదించడానికి తమ ఎన్ఐఏ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పేయ్)ని సిద్ధం చేస్తున్నట్టు స్పష్టమైంది. అయితే ఈ సీజన్ షూటింగు మొదలైందా? లేదా అనే విషయంపై ఇంకా ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. రెండో సీజన్‌ను ఎంజాయ్ చేస్తూనే ఫ్యామిలీ మ్యాన్ 3 సీజన్‌ కోసం వెయింటింగ్ మొదలైంది.

  The Family Man 2 Review | Samantha, Screenplay రెండూ సూపర్ !! || Filmibeat Telugu
  తెర వెనుక, తెర ముందు..

  తెర వెనుక, తెర ముందు..

  ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్
  నటీనటులు: మనోజ్ బాజ్‌పేయ్, సమంత అక్కినేని, ప్రియమణి, షరీబ్ హష్మీ, నీరజ్ మాధవ్, పవన్ చోప్రా, శరద్ కేల్కర్, గుల్ పనాగ్ తదితరులు
  రచన, నిర్మాణం, దర్శకత్వం: రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే
  కథా సహకారం, డైలాగ్స్: సుమన్ కుమార్, సుమిత్ అరోరా, మనోజ్ కుమార్, కలవైవన్
  సినిమాటోగ్రఫి: అజిమ్ మూలన్, నిగమ్ బోమ్జన్ (సీజన్ 1), కామెరాన్ ఎరిక్ బైసన్ (సీజన్ 2)
  ఎడిటర్: సుమిత్ కోషియా
  మ్యూజిక్: సచిన్, జిగర్
  కంపోజింగ్: కేతన సోదా
  బ్యానర్: డీజెడ్ఆర్ ఫిల్మ్స్

  English summary
  The Family Man Season 3 is set begin soon. Raj and DK's season 3 will be back drop of Coronavirus. Manoj Baipayee Next Fight With China And Coronavirus in Season 3.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X