Family Man Pre Release Review మృణాల్ థాకూర్‌కు హ్యాట్రిక్.. దిల్ రాజు, విజయ్ దేవరకొండకు అగ్ని పరీక్ష
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై యువ డైరెక్టర్ పరుశురామ్ పేట్ల రూపొందించిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నటించిన ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ మృణాళ్ థాకూర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో రిలీజైంది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు, ఆసక్తికరమైన అంశాల గురించిన వివరాల్లోకి వెళితే..
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్, ఆర్థిక సమస్యలు, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు నిర్మాతగా ఈ చిత్రంపై భారీ నమ్మకంతో హిట్ కొడుతామని చెబుతుండటంతో ఆడియెన్స్‌లో పాజిటివ్ అంశంగా మారింది.

ది ఫ్యామిలీ మ్యాన్ సినిమాను భారీగా, క్వాలిటీ విషయంలో రిచ్‌గా రూపొందించడంతో బడ్జెట్ అత్యధికంగా పెరిగిందనే చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను సుమారుగా 65 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే అంటే 45 కోట్లరూపాయలు మేర జరిగింది.
ఇక మూవీలో పాటలు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి. ఇప్పటికే రీల్స్ రూపంలో పోటెత్తాయి. దాంతో ఈ సినిమాకు మరింత సానుకూలంగా మారింది. మ్యూజిక్ ఈ సినిమాకు బలంగా కనిపిస్తున్నది. ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ సినిమాలో మ్యూజిక్ ఎక్కువగా ఆకట్టుకొన్న చిత్రంగా ప్రశంసలు అందుకొంటున్నది.
సీతారామం బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవడం, ఆ తర్వాత హాయ్ నాన్న కూడా సూపర్ హిట్ కావడంతో ఫ్యామిలీ మ్యాన్ చిత్రం మృణాల్‌కు హ్యాట్రిక్‌గా మారింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడితే.. హీరోయిన్‌గా ఆమె మరో మెట్టు ఎక్కడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇక తెలుగు అమ్మాయి అని ప్రతీ ఒక్కరు ఆమెను సొంతంగా భావిస్తారు.
ఫ్యామిలీ మ్యాన్ సినిమా విజయ్ దేవరకొండకు, దిల్ రాజ్‌కు పరీక్షలాంటిందే. వారి సినిమాలు ఇంతకు ముందు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ సినిమా వారికి తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రం వారికి ఏ రేంజ్ హిట్ ఇస్తుందనే విషయం ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











