పల్లెటూరికి వెళ్ళడానికి భయపడిన మహేష్.. 8 కోట్ల ఖర్చు, కళ్ళు చెదిరేలా!

Recommended Video

Maharshi Movie Update: Mahesh Babu & Producers Prefer 8 Crore Village Set | Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. మహేష్ తో సినిమా చేయడానికి రెండేళ్లపాటు ఎదురుచూసిన వంశీ పైడిపల్లి అద్భుతమైన కథతో మహర్షి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రైతు సమస్యల నేపథ్యంలో మంచి సందేశాత్మక చిత్రంగా మహర్షిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న మహర్షి చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్తలు బయటకు వస్తున్నాయి.

 విలేజ్‌లో మహర్షి

విలేజ్‌లో మహర్షి

రామోజీ ఫిలిం సిటీలో అత్యంత కీలకమైన విలేజ్ సన్నివేశాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం 8 కోట్ల భారీ ఖర్చుతో కళ్ళు చెదిరేలా విలేజ్ సెట్ నిర్మించారు. చూడగానే నిజమైన పల్లెటూరి అనుభూతి కలిగేలా ఆర్ట్ డైరెక్టర్స్ సెట్ ని నిర్మించారట. ఈ సన్నివేశాలు చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. రైతు సమస్యల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం కనుక పల్లెటూరికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయి.

భయపడి వెనక్కు

భయపడి వెనక్కు

మొదట సహజత్వం కోసం ఈ సన్నివేశాలని నిజమైన పల్లెటూరికి వెళ్లి చిత్రీకరిద్దాం అని అనుకున్నారట. ఎక్కువ భాగం షూటింగ్ ఉండడంతో సెక్యూరిటీ, మహేష్ అభిమానుల తాకిడి లాంటి అంశాలని దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువరోజులపాటు షూటింగ్ చూడడానికి వచ్చే జనాలని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. అందువలనే ఖర్చు ఎక్కువైనావిలేజ్ సెట్ నిర్మించాల్సి వచ్చిందని అంటున్నారు.

అల్లరి నరేష్‌తోనే ఎక్కువగా

అల్లరి నరేష్‌తోనే ఎక్కువగా

విలేజ్ సన్నివేశాలు ఎక్కువగా అల్లరి నరేష్, మహేష్ బాబు మధ్యే సాగుతాయట. ఈ చిత్రంలో అల్లరి నరేష్, మహేష్ బాబు స్నేహితులుగా నటిస్తున్నారు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన కార్పొరేట్ సంస్థ అధినేతగా మహేష్ కనిపించనున్నాడట. స్టూడెంట్ గా, అమెరికా నుంచి వచ్చిన సీఈఓగా, రైతు సమస్యలపై పోరాడే హీరోగా మహేష్ పాత్రలో మూడు కోణాలు ఉంటాయట.

కీలకమైన పాత్రల్లో

కీలకమైన పాత్రల్లో

సైనికుడు చిత్రం తరువాత వైజయంతి మూవీస్ నిర్మాణంలో మహేష్ నటిస్తున్న చిత్రం ఇది. దిల్ రాజు కూడా ఈ చిత్రానికి మరో నిర్మాత. క్రేజీ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రావు రమేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X