»   » ‘బాహుబలి’ మూవీ ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ అదిరింది (ఫోటో)

‘బాహుబలి’ మూవీ ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ అదిరింది (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమాకు సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ మేడే సందర్భంగా విడుదల చేసారు. రాజమౌళి బ్రాండ్ నేమ్‌కు ఏ మాత్రం తీసిపోకుండా పోస్టర్ ఉండటం గమనార్హం. ‘బాహుబలి-ది బిగినింగ్' ఫస్ట్ పోస్టర్ పై మీరూ ఓ లుక్కేయండి.

The first poster of 'Baahubali’

రాజమౌళి, ప్రబాస్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'బాహుబలి‌' . రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగాన్ని 'బాహుబలి ది బిగినింగ్‌'గా పిలుస్తున్నారు. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, సత్యరాజ్, రమ్య కృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈచిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మే 15 న విడుదల చేయాలని గతంలో ప్రకటించినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు..విజువల్ గ్రాఫిక్స్ మరింత లేటు అవటంతో... ఈ చిత్రాన్ని జూన్ చివరి వారంలో లేదా జులైలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 31న సినిమాకు సంబంధించిన అపీషియల్ ట్రైలర్ విడుదల చేయనున్నారు.


అబ్బురపరుస్తున్న ‘బాహుబలి' సెట్స్ (ఫోటోస్)


తన డ్రీమ్ ప్రాజెక్టు విషయంలో క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కావడం ఇష్టం లేకనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా కోసం మొత్తం 17 విఎఫ్ఎక్స్ స్టూడియోలు, 600 మంది ఆర్టిస్టులు పని చేస్తున్నారు. అనుకున్న సమయానికి పని పూర్తి కాలేదని రాజమౌలి తెలిపారు.


‘బాహుబలి' సినిమాకు ఇంటర్నేషనల్ హైప్ తేవడంలో భాగంగా...ప్రొడక్షన్ టీం ఆసియాకు చెందిన ప్రముఖ ఎడిటర్ జామేస్ మార్ష్‌కు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ఆసియాకు సంబంధించిన సినిమాలపై ఆయన రాసే ఆర్టికల్స్ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని ‘బాహుబలి' సెట్స్ ను సందర్శించిన ఆయన ‘బాహుబలి' సినిమా మేకింగుపై ఆర్టికల్ రాయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పలు ఇంటర్నేషనల్ మేగజైన్లలో బాహుబలి గురించిన ఆర్టికల్స్ రానున్నాయని తెలుస్తోంది.


ఇప్పటికే బాహుబలి సెట్స్ కు సంబంధించిన ఫోటోలు బయటకు రిలీజ్ అయ్యాయి. అబ్బుర పరిచేలా ఉన్న సెట్టింగులు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఇక సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించే విధంగా ఉంటుందని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ సినిమాకు మంచి పేరొస్తుందని నమ్ముతున్నారు.


దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగాన్ని ‘బాహుబలి.. ది బిగినింగ్' పేరుతో విడుదల చేస్తున్నారు. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం హాలీవుడ్ సినిమా రేంజిలో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.


ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది. సత్యరాజ్‌, రమ్యకృష్ణతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.

English summary
The first poster of 'Baahubali’ Released. It is known that Rajamouli have announced the release date of Baahubali as May 15th. But due to technical glitches, the film had to postpone its release.
Please Wait while comments are loading...