Sankranti Movies: 2023 సంక్రాంతిని మిస్ చేసుకున్న బిగ్ బడ్జెట్ సినిమాలు.. మెగా హీరోలవే ఎక్కువ!
కరోనా కష్టకాలం తర్వాత చాలావరకు సినిమాల రిలీజ్ డేట్స్ పై నమ్మకం కుదరడం లేదు ప్రకటనలు అయితే బాగానే ఇస్తున్నారు కానీ అసలు సినిమాలు అనుకున్న సమయానికి వస్తాయి అనే విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. రిలీజ్ రోజు థియేటర్స్ లో బొమ్మ పడే వరకు కూడా కొన్నింటికి గ్యారెంటీ ఉండడం లేదు. ఇక ఫెస్టివల్ సీజన్స్ లో టార్గెట్ చేసిన చాలా సినిమాలు కూడా వరుసగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి.
2023 సంక్రాంతికి రావాలనుకున్న ఒక ఐదు పెద్ద సినిమాలు అయితే ఊహించిన విధంగా వాయిదా పడుతూన్నాయి. దీంతో ఆ లిస్టులోకి వేరే సినిమాలు వచ్చి పడ్డాయి. ఇక 2023 సంక్రాంతికి రావాలి అనుకున్న సినిమాలలో ఏవేవి వాయిదా పడ్డాయి అనే వివరాల్లోకి వెళితే.. ముందుగా ఆదిపురుష్ సినిమా అందరికంటే ముందుగానే సంక్రాంతికి రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో తీవ్ర విమర్శలు రావడంతో మరి కొంత సమయం తీసుకుని రీవర్క్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో సంక్రాంతి రేస్ నుంచి ఈ సినిమా వాయిదా పడింది. ఇక అంతకుముందు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా వచ్చే సంక్రాంతి రావాలని అనుకుంది. కానీ మధ్యలో షూటింగ్ పనులు ఆలస్యం వలన ఇది కూడా డ్రాప్ అయ్యింది.


ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ కలయికలో రాబోయే RC 15వ సినిమా కూడా అప్పుడే రావాలని అనుకుంది. కానీ శంకర్ పనితీరు కారణంగా ఆ ప్రాజెక్టు కూడా ఆలస్యం అయిపోయింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో రాబోయే సినిమా కూడా అదే సమయానికి వస్తుంది అని ఆడియన్స్ ఎంతో ఆశగా ఎదురు చూశారు.


కానీ త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఫైనల్ చేసే క్రమంలో కొంత ఆలస్యం అయింది. ఇక ఆ సినిమా సమ్మర్లో విడుదల అవుతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కలయికలో రాబోతున్న బోలా శంకర్ ను కూడా 2023 సంక్రాంతికి తీసుకురావాలని అనుకున్నారు. కానీ షూటింగ్ పనులు ఆలస్యం వలన అది సమ్మర్ కు షిఫ్ట్ అయ్యింది. ఇక అంతకంటే ముందు మెగాస్టార్ వాల్తేరు వీరయ్యను సంక్రాంతికి విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.


Click it and Unblock the Notifications











