విజయ్ దేవరకొండ కోసం రష్మిక ఇంత త్యాగమా.. ఏం చేస్తోందో తెలుసా!

Recommended Video

Dear Comrade : Rashmika Trims Her Tresses For Movie | Filmibeat Telugu

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక మందన వెండి తెరపై సూపర్ హిట్ జోడి. వీళ్ళిద్దరూ జంటగా నటించిన గీత గోవిందం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక కెమిస్ట్రీకి యువత ఫిదా అయ్యారు. మరోమారు వీళ్ళిద్దరూ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక పాత్ర గురించి ఆసక్తికర వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ చిత్రంలో రష్మిక తాను పోషించే పాత్ర కోసం సాహసం చేయబోతోందంటూ కథనాలు వెలువడుతున్నాయి.

హీరోయిన్ ఇలా చేయడం

హీరోయిన్ ఇలా చేయడం

డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన మహిళ క్రికెటర్ గా నటిస్తోంది. గ్లామర్ పాత్రల్లో ఎక్కువగా అవకాశాలు వస్తున్న తరుణంలో రష్మిక ఈ చిత్రంలో నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్ లో కనిపించబోతోందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం కోసం రష్మిక తన కేశాలని కొంతవరకు కట్ చేసుకోబోతునట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న తరుణంలో కేశాలని తగ్గించుకోవడం సాహసోపేతమైన నిర్ణయమే.

మహిళా క్రికెటర్

మహిళా క్రికెటర్

మహిళా క్రికెటర్ గా కొంత మేరకు జడ కత్తిరించుకుని కూడా స్టైలిష్ గా కనిపించొచ్చని రష్మిక భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో ఇలా కనిపిస్తేనే బావుంటుందని దర్శకుడు భరత్ కమ్మ రష్మికాని కన్విన్స్ చేశాడట. భరత్ కమ్మకు ఇది డెబ్యూ మూవీ. విజయ్ దేవరకొండ పాత్ర పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మైత్రి మూవీస్ నిర్మాణంలో

మైత్రి మూవీస్ నిర్మాణంలో

డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. తక్కువ సమయంలోనే మైత్రి మూవీస్ భారీ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా జరుగుతోంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం విజయ్ దేవరకొండకు పెరిగిన క్రేజ్ కు అనుగుణంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో డియర్ కామ్రేడ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

క్రేజీ ఆఫర్లు

క్రేజీ ఆఫర్లు

విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాల గురించి అనేక వార్తలు వస్తున్నాయి. పలువురు స్టార్ డైరెక్టర్స్ విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక రష్మిక మందన కూడా దూసుకు పోతోంది. డియర్ కామ్రేడ్ తో పాటు నితిన్ సరసన వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతోంది త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X