twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాంతికి బంగార్రాజు.. దసరాకి ఘోస్ట్.. నాగ్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

    |

    కింగ్ అక్కినేని నాగార్జున చివరిగా బంగార్రాజు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. అయితే ఆ సినిమాలో ఆయనది ఒకరకముగా అతిథిపాత్ర అనే చెప్పలి. ఇక ఆ సినిమా తరువాత నాగాజున హీరోగా నటించిన తాజా చిత్రం 'ది ఘోస్ట్'. గరుడ వేగ లాంటి సినిమా తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ధీ ఘోస్ట్ అని టైటిల్ పెట్టడంతో ఈ సినిమా హారర్ కథతో తెరకెక్కిస్తున్నారు అని దెయ్యం కథ అని రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి అనేక విషయాల మీద క్లారిటీ ఇచ్చారు.

    ఈ సినిమాలో నాగార్జున మాజీ 'రా' ఏజెంట్ రోల్ లో నటిస్తున్నారని వెల్లడించారు. ఈ ఘోస్ట్ సినిమాను సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కించారని వెల్లడించారు. నిజానికి 'ది ఘోస్ట్' సినిమా ఓటీటీలో విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే, ఆ ప్రచారంలో నిజం లేదని, థియేటర్లలో సినిమాను విడుదల చేస్తామని రెండు రోజుల క్రితమే చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడమే కాక తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

     The Ghost Movie to Release on october 5th

    ఈ ఏడాది అక్టోబర్ 5 అంటే విజయ దశమి వస్తోంది. అలా సంక్రాంతికి హిట్ కొట్టిన నాగార్జున మళ్ళీ ఈ సినిమాతో దసరా సీజన్ ను టార్గెట్ చేశారని అంటున్నారు. ఇక తాజాగా సినిమా గ్లింప్స్‌ కూడా విడుదల చేశారు. గ్లింప్స్‌లో నాగార్జునను చూపించినది 35 సెకన్లు మాత్రమే అయినా ఆసక్తి రేకేత్తించారు. గ్లింప్స్‌ ఈ రేంజ్ లో ఉంటే థియేటర్లలో ఇక రచ్చ రచ్చే అని అంటున్నారు ఫాన్స్. సోనాల్ చౌహన్ కథానాయికగా నటిస్తున్న 'ది ఘోస్ట్' సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

    English summary
    Nagarjuna starrer The Ghost Movie to Release on october 5th on the eve of dussera.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X