twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంటర్నేషనల్ లెవల్‌కి....‘దేనికైనా రెడీ’ వివాదం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మంచు విష్ణు, హన్సిక జంటగా జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'దేనికైనా రెడీ' వివాదం ఇంటర్నేషనల్ లెవల్ కి చేరుకుంది. తాజాగా అంతర్జాతీయ హిందూ సంస్థ 'గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్' ఈ చిత్రం వివాదంపై స్పందించింది. దేనికైనా రెడీ చిత్రంలో బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

    ఈ మేరకు ఈ సంస్థ అమెరికాలోని టెక్సాస్‌లో పత్రికా ప్రకటన విడుదల చేసింది. హిందువుల మనో భావాలను, సంస్కృతిని కించ పరచడాన్ని తప్పుబట్టింది. దేనికైనా రెడీ చిత్ర దర్శక నిర్మాతలు బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. బ్రాహ్మణులను క్షోభ పెడుతున్న సదరు చిత్రంలోని అభ్యంతరకర సీన్లను, డైలాగులను తొలిగించడం లేదా, సినిమాపై నిషేదం విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

    కాగా...దేనికైనా రెడీ చిత్రంపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని తేల్చింది. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలను నమోదు చేశామని, వీటిపై శుక్రవారం చిత్రనిర్మాత మోహన్‌బాబు, హీరో విష్ణును పిలిపించి చర్చిస్తామని కమిటీ ఛైర్మన్‌ రేమండ్‌ పీటర్‌ తెలిపారు

    కాగా...కమిటీ వేయడంపై ఈ చిత్ర నిర్మాత మోహన్ బాబు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన కమిటీకి వ్యతిరేకంగా పిటీషన్ వేసారు. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చాక ప్రభుత్వ జోక్యం సరికాదని మోహన్‌బాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెలుతుందో చూడాలి.

    English summary
    
 ‘Denikaina Ready’ which created huge controversy hurting the sentiments of Brahmins, now we hear of The Global Hindu Heritage Foundation condemning the scenes and dialogues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X