»   » సరికొత్త కోణంలో....జయశంకర్ర్ లఘు చిత్రం

సరికొత్త కోణంలో....జయశంకర్ర్ లఘు చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్యకాలంలో యూట్యూబులో చాలా షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. అయితే అందులో ఆలోచనాత్మకంగా, మనిషిలో మార్పుతెచ్చే విధంగా ఉన్న లఘు చిత్రాలు కొన్ని మాత్రమే. అలాంటి వాటిలో ఒకటి తాజాగా విడుదలైన యువ దర్శకుడు జయశంకర్ర్ తెరకెక్కించిన లఘు చిత్రం ‘గాడ్ మస్ట్ బి క్రేజీ'.

మనిషిలోని స్వార్థాన్ని సరికొత్త కోణంలో చూపిస్తూ....దేవుడి క్యారెక్టర్‌ను ఎవరూ ఊహించని విధంగా ప్రజెంట్ చేసాడు. దేవుడు చాలా ఇష్టం గా ఈ భూమి ని క్రియేట్ చేసాడు, ప్రేమ తో మనుషులను క్రియేట్ చేసాడు ...కాని మీ మనషులు అనవసరమైనవి క్రియేట్ చేసి భూమి సర్వ నాశనం చేస్తున్నారు అనే బేసిక్ పాయింటుతో ఈ షాట్ ఫిల్మ్ సాగుతుంది.

మేము చేస్తుంది నాశనం కాదు...అభివృద్ధి అంటూ వాదిస్తున్న మనిషికి..దేవుడు ఏవిధంగా కనువిప్పు కలిగించిన తీరు ఆసక్తికరంగా ఉంది. డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఒక వేశ్య వర్జిన్ అంటే నమ్ముతాను కాని మీ మనుషులు తప్పు చేయలేదు అంటే నేను అసలు నమ్మను, మనషులు అన్నం తినకుండా అయినా ఉంటారు కానీ అబద్దం చెప్పకుండా ఉండలేరు అంటూ రాసిన డైలాగులు బావున్నాయి.

The God Must Be Crazy

గోవింద్ పాత్ర ఒక సార్, మాకు ఒక హోప్ కావలి, హెల్ప్ కావాలి ఎవరు చేస్తారు అంటే ...అందుకే కదా సాటి మనిషఇని ఇచ్చాను , ఒకరికొకరు సాయం చేసుకోవడానికే...కాని మీ మనషులు పక్క వాడిని పగ వాడిలా చుస్తున్నారు... ఒకరికొకరు చంపుకుంటున్నారు...దేవుడు నువ్వు చూడటానికి పర్సన్ కాదు, ప్రాసెస్ ...హి ఈస్ ఎవ్రీ వేర్...గో అండ్ ఫైండ్ హిమ్ అంటూ రాసిన డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి.

English summary
The God Must Be Crazy Telugu Short Film. Directed by Jayashankarr.
Please Wait while comments are loading...