పొల్లాచిలో పవన్-జూ ఎన్టీఆర్ లకి ఆటంకం...!?
ఈ మధ్య మన తెలుగు సినిమాలకు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ దృశ్యాలను చిత్రీకరించడానికి చాలామంది దర్శక నిర్మాతలు తమిళనాడులోని పొల్లాచ్చి పరిసరాలకు వెళుతున్నారు. హిల్ బ్యాక్ డ్రాప్ తో కూడిన గ్రీనరీ అక్కడ బాగుండడంతో ఆ లొకేషన్లను తమ షూటింగుకు ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ రెండు తెలుగు సినిమాల షూటింగులు జరగాల్సివుంది. అయితే, ప్రస్తుతం పొల్లాచ్చి ప్రాంతంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడి, నేల చిత్తడిగా మారడంతో షూటింగుకి అనువుగా లేదక్కడ.
ప్రస్తుతం తమిళనాడులో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న 'గబ్బర్ సింగ్" షూటింగ్ గత కొన్ని రోజులుగా అక్కడ జరుగుతోంది. కానీ వర్షాల కారణంగా అక్కడ షూటింగ్ ని రద్దు చేసుకుని ఈ యూనిట్ హైదరాబాద్ వచ్చేసింది. ఇక పొల్లాచ్చిలో షూటింగ్ ప్లాన్ చేసుకున్న జూ ఎన్టీఆర్ 'దమ్ము" షూటింగ్ కూడా వర్షాల కారణంగా వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది. ఈ 12 నుంచి అక్కడ జరగాల్సిన ఎన్టీఆర్ సినిమా 'దమ్ము' వర్షాలు తగ్గి, నేల ఆరాక తిరిగి ఈ చిత్రాల షూటింగు అక్కడ కొనసాగవచ్చు!


Click it and Unblock the Notifications











