twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ 'డమరుకం' చిత్రం హైలెట్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: తన కెరీర్‌లోనే మొదటిసారి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'డమరుకం' అని హీరో నాగార్జున అన్నారు. నాగార్జున, అనుష్క జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ పతాకంపై డా.వెంకట్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం గ్రాఫిక్స్‌ పనుల్లో ఉంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, 'నిర్మాత ఎక్కడా రాజీపడకుండా చాలా భారీగా ఈ చిత్రాన్ని తీశారు. దర్శకుడు కూడా నా అంచనాలకు మించి చిత్రాన్ని ఎంతో బాగా మలిచారు. గ్రాఫిక్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఉన్న కథాంశమిది. తప్పకుండా చిత్రం పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అని అన్నారు.

    సహ నిర్మాత వి.సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ, అక్టోబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. 'నాగార్జున కెరీర్‌లోనే అధిక బడ్జెట్‌ చిత్రమిది. భారతీయ వెండితెరపై ఇంతకుముందెన్నడూ ఈ తరహా చిత్రం రాలేదు. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రానికి నిర్మాతను అయినందుకు ఎంతో గర్వంగా ఉంది' అని నిర్మాత వెంకట్‌ తెలిపారు.ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

    ఈ చిత్రం హైలెట్స్ వరసగా...

    నాగార్జున, అనుష్క కెరీర్ లో ఎక్కువ బడ్జెట్ సినిమా ఇదే

    దాదాపు 45 కోట్ల వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కింది

    అమ్మోరు, అరుంధతి, మగధీర తరహాలో ఈ చిత్రం గ్రాఫిక్స్ హైలెట్స్ గా నడుస్తుంది

    దాదాపు తొమ్మిది నెలల పాటు ఈ చిత్రం గ్రాఫిక్స్ పై వర్క్ చేసారు. రాజమౌళి ఈగ కన్నా గ్రాఫిక్స్ బాగా కుదురాయని నాగార్జున స్వయంగా చెప్తున్నారు.

    ఈ చిత్రం దర్శకుడు శ్రీనివాసరెడ్డి గతంలో యమగోల మళ్లీ మొదలైంది వంటి సోషియో ఫాంటసీ సినిమా తీసి హిట్ కొట్టిన అనుభవం ఉన్నవాడు

    బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో నవ్వించిన చిత్రం ఇది.

    సౌత్ ఇండియాలో నంబర్ వన్ స్ధానంలో ఉన్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. 50 వ చిత్రం ఇది. ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విజయవంతమైంది.

    ఛార్మి.. సక్కుబాయ్ అంటూ చేసిన ఐటం సాంగ్ ఇప్పటికే అందరినోటిలో నానుతోంది.

    బిజినెస్ మ్యాన్ వంటి సూపర్ హిట్ చిత్రం అందించిన ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన చిత్రం ఇది.

    English summary
    Damarukam is one of the costliest films ever made in Telugu film industry as the estimated budget of this film has gone over Rs. 45 crores. It is learnt that the film is loaded with some breathtaking visual effects, which are going to set a new bench in terms of VFx standards in India. Devi Sri Prasad is composing the music and Charmi will be seen in an item number (Sakku Bhai). The film is scheduled for October 12 release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X