నాగార్జున చేతుల మీదగా ది హిందూ సినిమా ప్లస్ వీక్లీ ఎడిషన్....!
సౌత్ ఇండియాలో నెంబర్ వన్ న్యూస్ పేపర్ ది హిందూ. ది హిందూ పత్రిక పెట్టి దాదాపుగా వంద సంవత్సారాలు దాటింది. అలాంటి చరిత్ర కలిగినటువంటి ది హిందూ న్యూస్ పేపర్ 'సినిమా ప్లస్' వీక్లీ ఎడిషన్ ని తాజ్ కృష్ణ లో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి నాగార్జున, అల్లు అరవింద్, విష్ణు మంచు, రామ్, సునీల్, రమేష్ ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, ఢిల్లీ రాజేశ్వరి, శివ నాగేశ్వర రావు, రావు రమేష్, హర్ష వర్ధన్, రామ జోగయ్య శాస్త్రి, సెంథిల్, ఎవీస్, షఫీ, శర్వానంద్, దేవ కట్ట, కృష్ణుడు, గాయత్రీ రావు, సింగర్ సునీత, సూర్యతేజ్ మొదలగు వారు ఈకార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రయంలో మొట్టమొదటగా లైటింగ్ ఆఫ్ ల్యాంప్ నుమంచు విష్ణు మరియు సునీల్ చేతులు మీదగా వెలిగించడం జరిగింది. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ ది హిందూ న్యూస్ పేపర్ ఇంకా అంచలంచెలుగా తన ప్రస్దానాన్ని పెంపోందించుకుంటుందని అన్నారు. సమాజంలో ఉన్న మంచి చెడులను పారద్రోలడానికి మీడియా బాగా ఉపయోగపడుతుందని అన్నారు. 'సినిమా ప్లస్' తోలి కాపీని అల్లు అరవింద్ విడుదల చేసి నాగార్జున చేతికి ఇచ్చారు.


Click it and Unblock the Notifications











