»   » జూ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జుల కంటే ఫస్ట్ చాయిస్ మహేష్ బాబుకే...

జూ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జుల కంటే ఫస్ట్ చాయిస్ మహేష్ బాబుకే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి దాదాపు అన్ని బ్రాండ్స్ కి మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు ప్రిన్స్ మహేష్ బాబు. స్టార్ డమ్ గ్లామర్ రెండూ ఉండడంతో మహేష్ నే బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడానికి ఆయా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఉత్పత్తులకి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న మహేష్ తాజాగా ఐడియా సెల్యూలార్ కి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేశాడు. ఇటీవలే వివెల్ షాంపూ కి సైన్ చేసిన మహేష్ ఈ కొత్త ఐడియా తో అడ్వర్టైజింగ్ రంగంలో మరే తెలుగు నటుడికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

కాగా, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ తదితరులు కూడా యాడ్స్ చేయడం పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికీ చాలా కంపెనీలకి ఫస్ట్ ఛాయిస్ మహేష్ అవుతున్నాడు. అయితే ఏ ఉత్పత్తి అయినా ఒక్క దానికే ప్రచారం చేయడం నైతికం కాబట్టి మహేష్ ని ఏదైనా కంపెనీ ఎగరేసుకుని పోయాక మిగిలిన కంపెనీలు ఇతర హీరోలతో అడ్జెస్ట్ అవుతున్నారు. హిట్ సినిమా ఇచ్చి అయిదేళ్లు గడుస్తున్నా కానీ మహేష్ బాబుకి ఈ క్రేజ్ ఉందంటే అతని చరిష్మా ఏ స్థాయిదనేది అర్థం చేసుకోవచ్చు..

English summary
Prince Mahesh Babu can be termed as The King of ad world. He is the most wanted Tollywood celebrity by the celebrated brands and popular companies. Mahesh Babu has been the ruler in this section since the day he started endorsing brands. Now, Idea Cellular has joined the list of brands being promoted by Mahesh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu