ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే సినిమాలో....

By Bojja Kumar

మలయాళ సూపర్‌స్టార్లు మమ్ముట్టి, సురేష్ గోపి ఒకే చిత్రంలో దర్శనం ఇవ్వనున్నారు. ఆ ఇద్దరి కాబినేషన్లో దర్శకుడు షాజీ కైలాస్ రూపొందిస్తున్న చిత్రం'ది కింగ్ అండ్ కమీషనర్'. ఈ చిత్రాన్ని తెలుగులో కల్పన చిత్ర పతాకంపై నిర్మాత కోనేరు కల్పవిడుదల చేస్తున్నారు. చిత్ర విశేషాలను దర్శకుడు వెల్లడిస్తూ ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రెండు పవర్‌ఫుల్ పాత్రలను ఒకే చిత్రంలో చూపించాలనే కొత్త ఆలోచనతో ఈ కధను ఢిల్లీ నేపథ్యంలో రూపొందించానని, నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్‌గా మమ్ముట్టి, ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా సురేష్ గోపి నటిస్తున్నారని దర్శకుడు తెలిపారు.

ఓ కీలకమైన కేసును పరిశోధించే క్రమంలో ఇద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశంతో సాగే చిత్రంలో పాటలు లేవని, ఆర్‌ఎఫ్‌సి, చెన్నైలలో షూటింగ్ చేసిన ఈ థ్రిల్లర్ మూవీని ఏప్రిల్ నెలలో విడుదల చేస్తామని నిర్మాత కోనేరు కల్పన తెలిపారు. గతంలో ఈ ఇద్దరు సూపర్ స్టార్లు నిర్మించిన కమీషనర్, ద కింగ్, భరత్ చంద్ర ఐపిఎస్ వంటి చిత్రాలతో పోలీస్ కాప్స్‌గా విశేష ఆదరణ పొందాయి. వీరికి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో నిర్మాతలు ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X