రామ్ చరణ్, వినాయిక్ చిత్రం టైటిల్ ట్యాగ్ లైన్

By Srikanya

హైదరాబాద్: రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి 'నాయక్ ' అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ కు ట్యాగ్ లైన్ గా 'ది లీడర్'అని పెట్టినట్లు సమాచారం. ఈ టైటిల్ కు పెట్టిన ట్యాగ్ లైన్ కు రామ్ చరణ్ అభిమానులనుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో ఈ ట్యాగ్ లైన్ జస్టిఫై అయ్యేలా సెకండాఫ్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం మాస్ మసాలా మూవీగా తెరకెక్కుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ చిత్రం బిజినెస్ అప్పుడే ప్రారంభమై మంచి ఊపు మీద ఉంది. రోజూ విపరీతంగా ఎంక్వైరీలు వస్తున్నాయని, డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు చాలా ఉత్సాహం చూపిస్తున్నారని వినికిడి. తాజాగా గుంటూరు లోని హరి ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని మూడు కోట్ల నలభై లక్షలకు తీసుకున్నారు. ఇది రికార్డు అని చెప్తున్నారు. వివి వినాయక్,రామ్ చరణ్ కాంబినేషన్ భాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని భావించి ఈ రేంజి రేట్లు పలుకుతున్నాయి. అలాగే చిరంజీవి సూపర్ హిట్ శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో పాట ను ఈ చిత్రం కోసం రీమిక్స్ చేస్తున్నారు. రామ్ చరణ్,కాజల్ పై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్‌ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. దర్శకుడు వినాయక్‌ చిత్రం గురించి చెబుతూ ..చిరంజీవిగారితో 'ఠాగూర్‌' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తామని అన్నారు. నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...చరణ్‌ని ఒక కొత్త తరహా పాత్రలో చూపెట్టబోతున్నారు దర్శకుడు.

వినోదం, యాక్షన్‌... తదితర అంశాలు అభిమానుల్ని మెప్పించేలా ఉంటాయి. వాణిజ్య విలువలతో కూడిన కథాంశమిది. వినోదాత్మకంగా సాగుతుంది. మగధీర' తర్వాత కాజల్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈచిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X