బాలయ్య ఫ్యాన్స్ జోష్: ‘లెజెండ్’ బైక్ కేకు! (ఫోటో)
హైదరాబాద్: ‘లెజెండ్' సినిమా విజయోత్సవ సంబరాల మూడ్లో ఉన్న బాలయ్య అభిమానులు 2015 నూతన సంవత్సరాన్ని ఫుల్ జోష్ తో జరుపుకుంటున్నారు. వేడుకల కోసం ‘లెజెండ్' బైక్ ఆకారంలో ఉన్న 100 కేజీల కేకును తయారు చేయించారు. ఈ కేక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
గుంటూరు జిల్లా తెనాలిలోని గంగానమ్మ పేటకు చెంది శశి బేకరీ వారు ఈ కేక్ తయారు చేసారు. 2014 సంవత్సరానికి వీడ్కోలు పలకడానికి ఇంతకంటే మంచి మార్గం లేదు. 2014 సంవత్సరంలో జరిగిన లెజెండ్ 275 డేస్ ఫంక్షన్ అభిమానులు కలకాలం గుర్తుంచుకుంటారు అంటున్నారు.

ఇక బాలయ్య నటిస్తున్న తాజా సినిమా విషయానికొస్తే...ఈ చిత్రానికి ‘లయన్' అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన త్రిష, రాధికా ఆప్టే రొమాన్స్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, ఆలీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను పారిశ్రామికవేత్త రమణారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు త్వరలోనే అఫీషియల్ ప్రకటన ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్ ఈ రోజు రాత్రి 11.12 గంటలకు విడుదల చేయాలని ముహూర్తం నిర్ణయించారు. ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆ మధ్య విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఫస్ట్ లుక్ టీజర్ అదిరి పోయేలా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











