twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ వినీలాకాశంలో దృవతార ఎన్టీ రామారావు

    By Bojja Kumar
    |

    జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చి, వారి ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు నందమూరి తారకరామారావు. ఈ రోజు ఆయన 16వ వర్ధంతి. 1923 మే 23న కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు అనే గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన 320 కి పైగా చిత్రాల్లో నటించారు. 1949 లో 'మనదేశం' చిత్రంతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసి వైవిధ్యవంతమైన పాత్రలు పోషించి ఆంధ్రుల అభిమానాన్ని చూరగొని 'నటరత్న' గా మన్ననలు పొందారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలు శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, దుర్యోధనుడు, భీష్ముడు, భీముడు, రావణాసురుడు ఇత్యాదులెన్నో అసమాన రీతిలో పోషించి పండిత పామరుల గుండెలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. 'పాతాల భైరవి', 'మిస్సమ్మ', 'మాయా బజార్', 'గుండమ్మ కథ', 'రాముడు భీముడు', దాన వీర శూర కర్ణ', 'బొబ్బిలి పులి', 'వేటగాడు' ఇవే కాక ఇంకా చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఆయన సాధించారు. ఆయన తన అధ్బుత నటనతో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

    1982 లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది మాసాలలో రాష్ట్రం నాలుగు చెరగులా పర్యటించి ప్రజాభిమానంతో ఎన్నికల పోరాటంలో అఖండ విజయం సాధించి రికార్డు సృష్టించారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. తెలుగు భాషాభివృద్ధికి తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించారు. తెలుగువారి కీర్తి నలుదెసల్ వెదజల్లి తెలుగు రుచులనెల్ల తెలియజెప్పి కీర్తిఘనుడు యెక్కె గిన్నీసు బుక్కుల అతనికతడెసాటి అక్కిరాజ తెలుగు జాతికతడు తెచ్చిన ఖ్యాతి తో అయ్యె శాశ్వతుండు అవనిమీద అపరవిక్రమార్కుడన చెల్లునాతని అతని కతడె సాటి.

    English summary
    Nandamuri Taraka Ramarao as he is fondly known, needs no introduction. This iconic Legend will remain firmly in the hearts and minds of millions of Telugu people around the world for his unparalleled services to the Telugu community. To date, it has been 16 years since he passed away.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X