»   » దివంగత స్టార్‌ని గ్రాఫిక్స్‌తో పుట్టించి, లీడ్ రోల్‌లో సినిమా : తెరమీద కోడి అద్భుతం

దివంగత స్టార్‌ని గ్రాఫిక్స్‌తో పుట్టించి, లీడ్ రోల్‌లో సినిమా : తెరమీద కోడి అద్భుతం

Posted By:
Subscribe to Filmibeat Telugu

అద్బుతమైన గ్రాఫిక్స్ తో తెలుగు తెరమీద విజువల్ అద్బుతాలని తీసిన దర్శకుడు కోడి రామకృష్ణ, నిజానికి తెలుగు సినిమాలో ఎక్కువ భాగం గ్రాఫిక్స్ వాడటాంజి పరిచయం చేసిన దర్శకుడు ఆయనే. అమ్మోరు, దేవి, అంజి,అరుంధతి ఇలా గ్రాఫిక్స్ అద్బుతాలని తెలుగు తేరమీద ప్రదర్శించిన ఘనత కోడికే చెందుతుంది.

ఆయన సమకాలీన దర్శకులంతా మెగాఫోన్ పక్కన పెట్టినా ఇప్పుడు కూడా అంతే పట్టుదలతో అదే కాన్సంట్రేషన్ ని చూపిస్తూ దర్శకత్వం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడీ గ్రాఫిక్స్ మాంత్రీకుడు ఇంకో విజువల్ అద్బుతానికి తెర తీసాడు అయితే ఇది మాత్రం తెలుగు లో కాదు కన్నడ లో.... ఆ సినిమా పేరు.. "నాగరహవు".

ఈ సినిమా ప్రత్యేకత ఏమిటో తెలుసా ఏడేళ్ళ క్రితం మరణించిన కన్నడ సూపర్ స్టార్ విష్ణు వర్థన్ ముఇఖ్య పాత్రగా సినిమా తీస్తున్నారు. ఆయన చనిపోయి ఇప్పటికి ఏడుసంవత్సరాలు దాటింది అయినప్పటికీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆయన పాత్రను పున:సృష్టించి. ఆ పాత్రనే లీడ్ క్యారెక్టర్‌గా చేసి సినిమా చేస్తుండటం విశేషం.

కొన్ని సంవత్సరాల క్రితం ఈ టీవీ తీసిన "నరుడా ఏమి నీ కోరిక" అనే సీరియల్ లో టీవీ నటుడు రాజా ని కూడా ఇలాగే గ్రాఫిక్స్ ద్వారా సృష్టించి రెండు మూడు ఏపిఒసోడ్ లు చేసారు, వజ్రోత్సవాల సమయం లోనూ దివంగత మహానటుడు ఎంటీఆర్ ని కూడా ఇలాగే సృష్టించి మాట్లాడించారు, డైలాగులు చెప్పించారు.

ఐతే ఇలా పూర్తి స్థాయి సినిమా తీయడం మాత్రం అరుదైన విషయం. ఈ సినిమాకు సంబంధించి కోడి రిలీజ్ చేసిన టీజర్ కర్ణాటక లో ఇప్పుడు ఒక సెన్సేషన్అయ్యింది. 7 దేశాలకు చెందిన 500 మందికి పైగా విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులు 730 రోజుల పాటు శ్రమించి.. ఈ సినిమాకు ప్రాణప్రతిష్ట చేశారట.

టీజర్లో విష్ణువర్ధన్ లుక్ అద్బుతంగా ఉంది.అయితే ఇదివరకు చేసినవన్నీ కొన్ని నిమిషాల పాటు మాత్రమే చేసినవి మరి ఓ గ్రాఫిక్ క్యారెక్టర్‌తో సినిమా మొత్తం తీయటం, ఆ క్యారెక్టర్ తో మెప్పించటం అంటే మాటలుకాదు... చూడాలి కోడి ఈ సారి కూడా ఇంకో అద్బుతాన్ని చూపించేలా ఉన్నాడు..

English summary
Forty six years after his popular lead role in a Movie Nagarahaavu, it could be happenstance that Kodi Ramakrishna is bringing back Vishnuvardhan to life for the late actor’s 201st film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu