విమర్శకులు నన్ను అసహ్యించుకునే కొద్దీ...తాప్సీ
'క్రిటిక్స్ నన్ను అసహ్యించుకునే కొద్దీ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎవరికి ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావడంలేదు"" అని తాప్సీ రీసెంట్ గా తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. రీసెంట్ గా విడుదలైన వీర చిత్రంలో తాప్సీ మితిమీరి తన అందాల ప్రదర్శన చేసిందని, కాస్త నటన కూడా నేర్చుకుంటే బావుంటుందని క్రిటిక్స్ ఆమెపై విమర్శలు చేసారు.దానికామె ఇలా స్పిందించింది. ప్రస్తుతం తాప్సీ గోపిచంద్ సరసన 'మొగుడు" చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రానికి కృష్ణవంశీ డైరక్షన్ చేస్తున్నాడు.ఈ మధ్యనే ఈ చిత్రానికి సంభందించి ఇంట్రడక్షన్ సీన్‌ని షూట్ చేసారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వివరిస్తూ...ఇంట్రడక్షన్ సీన్ కోసం క్లాసికల్ డాన్స్ చేశాను. కొంత గ్యాప్ తర్వాత క్లాసికల్ డాన్స్ చేయడం నన్ను థ్రిల్‌కి గురి చేసింది. ఈ చిత్రంలో సరికొత్త లుక్‌లో కనిపిస్తాను. కృష్ణవంశీ సినిమాలో నటించడం అంటే ఏంటో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఆయన 'పర్‌ఫెక్షనిస్ట్" అంటూ పొగడ్తలు వర్షం కురిపించింది. గతంలోనూ మిస్టర్ ఫెరఫెక్ట్ షూటింగ్ సమయంలోనూ ట్విట్టర్ లో ఆమె ఇలాగే రోజూ డైరక్టర్ నో, హీరోనో పొగుడుతూ ట్వీట్ చేసేది.


Click it and Unblock the Notifications











