యూఎస్ లో విడుదలకు ముందే దూకుడు రేంజ్ చూపిస్తున్న పంజా...!

By Sindhu

టాలీవుడ్ అంతా ఇప్పుడు పవన్ కల్యాణ్ తాజా సినిమా 'పంజా' వైపే చూస్తోంది. ఈ నెల 9 న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఫలితం ఎలా ఉంటుందన్న విషయంపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇదిలా ఉంచితే, ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 1800 థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ జరుగుతోంది.

దూకుడు సినిమాతో తెలుగు సినిమాని కూడా యుఎస్ మీడియా పట్టించుకోవడం మొదలు పెట్టిందనే సంగతి తెలిసిందే. ఆ చిత్రం యుఎస్ లో సాధించిన వసూళ్లు అక్కడి మీడియాని ఆశ్చర్యపరిచాయి. అలాగే శుక్రవారం విడుదలవుతోన్న పంజా అప్పుడే వారి దృష్టిలో పడిపోయింది. ఇంకా విడుదల కూడా కాకుండానే ఈ చిత్రంపై ఉన్న బజ్ వారిని ఆకట్టుకుంది.

అందుకే నయాగరాఫాల్స్ అనే వార పత్రికలో పంజా గురించిన కవరేజ్ వచ్చింది. వారి తరపున ఈ చిత్రం చూసేందుకు ఒక రిపోర్టర్ ని కూడా పంపించాలని నిర్ణయించారు. 22వేల సర్క్యులేషన్ ఉన్న ఈ పత్రికకి ఆన్ లైన్ ఎడిషన్ లో సినిమా పేజికి యావరేజ్ గా లక్షా ఇరవై వేలకి పైగా హిట్స్ ఉన్నాయి. ఇలాంటి పత్రికలో ఓ తెలుగు చిత్రానికి కవరేజ్ దక్కడమంటే ఆషామాషి విషయం కాదు. మరి ఈ ప్రీ రిలీజ్ బజ్ ని పంజా ఎంతవరకు అందుకుంటుందనేది చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X