»   »  ‘వన్ ఫింగర్ సెల్పీ ’ఛాలెంజ్ :ఇదో బూతు గోల, మన హీరో, హీరోయిన్స్ కూడా ఈ పిచ్చి?

‘వన్ ఫింగర్ సెల్పీ ’ఛాలెంజ్ :ఇదో బూతు గోల, మన హీరో, హీరోయిన్స్ కూడా ఈ పిచ్చి?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ముంబై: ఐస్ బక్కెట్ ఛాలెంజ్, రైస్ బక్కెట్ ఛాలెంజ్ ...ఇలా జనానికి ఎప్పుడూ ఏదో ఒకటి కొత్త ట్రెండ్ కావాలి. అందుకోసం వాళ్లు నిరంతరం కొత్త ఆలోచనలు అన్వేషిస్తూంటారు. ఏదో టాపిక్ లేకపోతే వాళ్లకు పొద్దు గడవదు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న కల్చర్ ని ఎడాప్ట్ చేసుకోవటంలో మన సెలబ్రెటీలను మించినవాళ్లు ఉండరు. ఇదిగో ఇప్పుడిప్పుడే మొదలవుతున్న...అలాంటి ట్రెండ్ గురించే ఇప్పడు ఓ విషయం గురించి మీకు చెప్పబోతున్నాం.

    వన్ ఫింగర్ సెల్ఫీ..ఇప్పుడిప్పుడే ...సోషల్ మీడియాల్లో పరిచయమవుతున్న మ్యాటర్. ఎక్కడో జపాన్ మొదలైన ఈ ట్రెండ్ ... మన దేశంలోకి కూడా పాకబోతోంది. సామాన్య జనం ఎలా ఉన్నా..ముందు సెలబ్రెటీలు ఈ విషయాన్ని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇప్పటికే హాలీవుడ్ లో కొందరు స్టార్స్ ఈ ట్రెండ్ ని వంటబట్టించుకునే పనిలో ఉన్నారు. వాళ్లకన్నా మేమేం తక్కువ అన్న రీతిలో ఇక్కడ స్టార్స్ కూడా రెచ్చిపోవాలని ఫిక్స్ అయ్యారట. అయితే ఈ వన్ ఫింగర్ ఛాలెంజ్ ఏమిటి..అసలు దీనికు మూలం ఏమిటి అంటే కాస్త లోతుగా వెళ్లాళ్సిందే.

     సరదాగా కోసం

    సరదాగా కోసం

    ఈ ఛాలెంజ్ ని మొదట డిస్కవర్ చేసింది జపాన్ కు చెందిన యానిమీ ఆర్టిస్ట్ ..స్కై ప్రీజడమ్. ఇది ఓ సెల్ఫీ ఛాలెంజ్. సరదాగా ఓ ఛాలెంజ్ కలగలిపిన సెల్ఫీ వ్యవహారం. అయితే ఇది సరాదా కోసం ఆయన తయారు చేసింది.

     వన్ ఫింగర్ ఛాలెంజ్ అంటే...

    వన్ ఫింగర్ ఛాలెంజ్ అంటే...

    ఆయన వేసిన ఓ యానిమి లో ఓ పాత్ర... తన ప్రెవేట్ పార్ట్ లను కనపడకుండా ఒక వేలుతో మూసి సెల్ఫీ దిగాలి. కనపడిందా ఆ సెల్ఫీ ఫెయిల్ అయినట్లే. ఈ విషయం ఆయన బయిటకు చెప్పిన వెంటనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.

     యూ ట్యూబ్ వీడియోలు

    యూ ట్యూబ్ వీడియోలు

    ఇక ఆయన ఈ ఫొటో సరదాగా గీసి మంగా కామిక్స్ తో రివీల్ చేయగానే ..జనం అలాంటి సెల్ఫీలు తీసుకుని ట్విట్టర్ లో పెట్టడం మొదలెట్టారు. మరికొందరు ఉత్సాహవంతలు వెంటనే ఈ సెల్ఫీ ఛాలెంజ్ ఎలా చేయాలి అనే విషయమై యూ ట్యూబ్ వీడియోలు సైతం విడుదల చేసేసారు.

     అదే పనిపై ఛాలెంజ్ లు

    అదే పనిపై ఛాలెంజ్ లు

    ఎప్పుడైతే ట్విట్టర్ లో ఈ ఫొటోలు సందడి మొదలైందే...చాలా మంది దీన్ని అనుకరిస్తూ ఫొటోలు దిగటం మొదలెట్టారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ విషయమై ఛాలెంజ్ లు నడుస్తున్నాయి. ఎవరు సక్సెస్ అవుతున్నారు. ఎవరు ఫెయిల్ అవుతన్నారు అనే విషయం హైలెట్ గా నడుస్తోంది.

     ఆ హీరోయిన్ కి సూటబుల్

    ఆ హీరోయిన్ కి సూటబుల్

    ఇక ఈ ఛాలెంజ్ ..రియాలటీ టీవి స్టార్ హీరోయిన్ కిమ్ కదరిస్దాన్ కు ఫెరఫెక్ట్ గా సూట్ అవుతుందని అంటున్నారు. ఇక ట్విట్టర్ లో #1FingerSelfieChallenge హ్యాష్ ట్యాగ్ తో పెడుతున్నారు. ఇవి వైరల్ అవుతున్నాయి. వీటిని చాలా మంది కుర్రకారు అనుకరిస్తున్నారు.

     మగాళ్లవి వద్దు బాబోయ్

    మగాళ్లవి వద్దు బాబోయ్

    ఇక ఈ సెల్ఫీలలో మేల్ వెర్షన్ వద్దు బాబోయ్ అంటున్నారు నెట్ జెన్లు. ఆడవాళ్లవంటే చూడగలం కానీ మగాళ్లు ఈ చాలెంజ్ అంటూ రంగంలోకి దిగితే విరక్తి వచ్చేస్తుందని కామెంట్ వినిపిస్తున్నాయి. మరి మగాళ్లు ఆగుతారా చూడాలి.

    మన సెలబ్రెటీలు

    మన సెలబ్రెటీలు

    ఇక ఎప్పటికప్పుడు ఇతర దేశ సంస్కృతిని వంటబట్టించుకుని ముందుకు వెళ్లి క్రేజ్ తెచ్చుకునే మన సెలబ్రెటీలు, సినీ స్టార్స్ సైతం ఇప్పటికే ఈ ప్రయత్నాలు మొదలెట్టేసారు అంటున్నారు. అయితే సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో అవి పెట్టడానికే ధైర్యం చాలటం లేదట.

     ఈమె పెడుతుంది

    ఈమె పెడుతుంది

    ఇక బాలీవుడ్ మీడియా అనేదేమిటంటే ఖచ్చితంగా ఈ విషయంలో పూనం పాండే వెనకాడదు. రేపో, ఈ రోజో ఈ ట్రెండ్ లో కొన్ని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంది అంటున్నారు. ఇలాంటి అవకాసం కోసమే ఆమె చూస్తుందని చెప్తున్నారు.

    మన వాళ్లు

    మన వాళ్లు

    అయితే రీజనల్ లాంగ్వేజ్ నుంచి ఇలాంటి సెల్ఫీలు వచ్చే అవకాసం లేదని అంటున్నారు. అలాంటి సెల్ఫీలు తీసి పోస్ట్ చేసే ధైర్యం ఎవరికీ లేదని, ఆ పనులు చేయరని అంటున్నారు. మరి ఇక్కడ వాళ్లు ఏం చేస్తారో చూడాలి.

     నో సీరియస్

    నో సీరియస్

    అయితే ఈ కొత్త ట్రెండ్ పై కొందరు సంప్రదాయవాదులు మండిపడుతున్నారు. కానీ సోషల్ మీడియా జనం ...ఫోర్న్ కూడా డైరక్ట్ గా ఆన్ లైన్ లో దొరుకుతున్న ఈ రోజుల్లో ఇలాంటివి లైట్ తీసుకోవాలని వాదిస్తున్నారు. ఫన్ గానే ఈ ట్రెండ్ ని పరిశీలీంచాలని అంటున్నారు.

     రెండు చోట్లా

    రెండు చోట్లా

    ఇంకో నాలుగైదు రోజులు పోతే మన సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ఫొటోలు చూస్తామని అంటున్నారు. హాలీవుడ్ సెలబ్రీటులు ఈ ట్రెండ్ ని ఎడాప్ట్ చేసుకుంటారని, అది చూసి మన బాలీవుడ్ బ్యాచ్ కూడా ఖచ్చితంగా మన మీదకు కొన్ని సెల్ఫీ ఛాలెంజ్ లు వదులుతారని అక్కడ మీడియా అంటోంది.

    English summary
    2016 will go out with a bang as perhaps the sexiest social-media trend yet is only just gaining traction-the #1fingerselfiechallenge. Inspired by an image from a Japanese manga, this “challenge” is no small feat.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more