కళ్ళు లేకుండానే దర్శకత్వం

అయితే కెమెరా కన్నులోకి తన కన్ను పెట్టలేని అతను సినిమాని ఎలా డైరక్ట్ చేస్తున్నాడు అనే అడిగితే దానికతను నేను ఈ సినిమాకి నిర్మాతను, కధా రచయితను, అసోశియేట్ డైరక్టర్ ని కావటంతో ఇది సాధ్యమవుతోందంటున్నాడు. కెమెరాతో డైరక్ట్ గా ఇంట్రాక్ట్ కాకపోయినా నా టీమ్ అందించే సపోర్టుతో ఏ ఇబ్బంది లేకుండా షూటింగ్ జరుగుతోందంటున్నాడు. కాస్ట్యూమ్స్, లొకేషన్స్, నటీనటులు హావభావాలు ఎలా ఉండాలో చెప్తూంటారు..డిస్కస్ చేస్తూంటాను. అయినా నేను కళ్ళు ఉన్నప్పుడు దాదాపు ఇరవై ఏడు దేశాలు పైగా తిరిగాను.
అక్కడ విజువల్ సీనరీస్ అక్కడ కాస్ట్యూమ్స్ నాకు గుర్తే. అంతేగాక నేను శాన్ ప్రాన్సికో స్టేట్ యూనివర్సిటీలో కలర్ అండ్ డిజైనింగ్ పై కొన్ని క్లాస్ లకు అటెండయ్యాను. ఇక నా లెక్క ప్రకారం బ్లైండ్ పీపుల్ కూడా మామూలువాళ్ళు లాగా టెక్నాలిజీని వినియోగించుకోవటం ద్వారామెలగచ్చు అంటున్నాడు. ఇక ప్రత్యేకంగా హోమో సెక్స్ వాలిటీ పై సినిమా చేయటానికి ప్రత్యేకమైన కారణం ఉందా అంటే శాన్ ప్రానిన్స్ కో లో ఈ తరహా జనాన్ని చాలా దగ్గరగా గమనించాను. అయినా హిందీలో ఈ మధ్యన దోస్తానా, కల్ హో నా హో, క్యా కూల్ హై హమ్ చిత్రాల్లో ఇలాంటి పోకడలు కనపడటం గమనించలేదా అంటున్నాడు.
అలాగే ఈ చిత్రం యువతకు కాకుండా వాళ్ళ తల్లి తండ్రులను ఉద్దేశించి చేస్తున్నానంటున్నాడు. తమ పిల్లలు హోమ సెక్స్ వల్స్ అయిన వెంటనే ఇళ్ళలోంచి తరిమేస్తారు. ఆ పిల్లలు ఏమౌతారు. పేరెంట్సే కాదంటే వారి పరిస్ధితి ఏమిటి...అయినా అతి సహజంగా ఈ కోరికలు పుడతాయి.దానికి ఒకరిని నిందించి లాభమేముంటుంది అంటున్నాడు. అలాగే తన చిత్రాన్ని కమర్షియల్ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం కిరణ్ గోయల్ కింగ్ మల్టి టెక్ కంపెనీ కి సీఈఓ. కళ్ళు లేకపోయినా మ్రెక్కువోని ఉత్సాహంతో సమాజానికి ఏదో చేయాలనే తలంపుతో ముందుకెళ్తున్న కిరణ్ కి విషెష్ చెబుదాం.


Click it and Unblock the Notifications











