వర్మ 'శివ' సినిమాకి మూలమిదా?

By Staff

Shiva
ఉందనే అంటారు వర్మ. ఆయన శివ సినిమా ప్లాట్ లైన్ ఎలా పుట్టిందో తన బ్లాగ్ లో చెప్పుకొచ్చారు. బ్రూసిలీ రిటన్ ఆఫ్ ది డ్రాగన్ సినిమానలోని మెయిన్ పాయింట్ ని లిప్ట్ చేసి శివ రూపొందించారుట. అందులో లీ రోమ్ లో ఉన్న ఓ చైనీస్ రెస్టారెంట్ లో పనిచేయటానికి హాంకాంగ్ నుంచి వస్తాడు. అక్కడ లోకల్ గూండాలు ఆ రెస్టారెంట్ ఓనర్ని చాలా ఇబ్బంది పెడుతూంటారు. అది చూసి తట్టుకోలేని స్ధితిలో లీ మెల్లిగా ఆ సమస్యలోకి దూరి వాళ్ళతో తగువు పెట్టుకుంటాడు. అయితే లీ ఊహించినంత తక్కువగా ఆ గూండాలు ఉండరు.వాళ్ళ వెనక చాలా పెద్ద నెట్ వర్క్ ఉంటుంది.

క్లైమాక్స్ లో వాళ్ళ డాన్ Chuck Norris తో లీ పోరాడి గెలుస్తాడు. అదే విధంగా నాగార్జున టౌన్ నుంచి సిటీ కాలేజీకి వస్తాడు. అప్పటికే ఆ కాలేజి పూర్తిగా గూండాల ఆధ్వర్యంలో ఉంటుంది. లోకల్ గూండాలు స్టూడెంట్స్ ని ఇబ్బంది పెడుతూంటారు. వారితో పోరాడుతూ చివరకు రఘువరన్ తో క్లైమాక్స్ లో పెద్ద ఫైట్ చేసి గెలుస్తాడు. అలాగే సింపుల్ గా ఉన్న ప్లాట్ లైన్ కి ఆయన కొన్ని తన నిజ జీవిత పాత్రలును ఎడాప్ట్ చేసానంటారు వర్మ.

అలాగే సినిమాలో బాగా పేలిన సన్నివేశాలు కూడా కాపీనే అంటాడాయన . ముఖ్యంగా..సినిమాలో వచ్చే గణపతి చందా కలెక్షన్ సీన్ దిలీప్ శంకర్ కాలచక్ర సినిమాలోది. అలాగే పాట ముందు నాగార్జునకు అమల కాఫీ ఇచ్చే సీను సంజీవ్ కుమార్ సినిమాలోదిట. అలాగే హైలెట్ గా నిలిచిన సైకిల్ ఛేజింగ్ సన్నివేశం రాహుల్ రవైల్ అర్జున్ సినిమాలోది. ఇక నాగార్జున మిత్రుడు చనిపోతే అతని తల్లి ఇన్సపెక్టర్ ని చెంపదెబ్బ కొట్టే సన్నివేశం స్టీవెన్ స్పీల్ బర్గ్ జాస్ సినిమాలోదిట. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయట.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన బ్లాగులో చెబుతూ...హ..హ..అదే మన క్రియేటి విటీ అంటాడు.ఇక ఇలా తన సినిమాకు మూలముందని ఆయన నిజాయితీగా చెప్పినందుకు సంతోషించాలా..లేక మన తెలుగు చలన చరిత్రలో ఓ మలుపు భావిస్తున్న ఈ సినిమానూ కాపీనే అంటున్నందుకు బాధ పడాలా అనే విషయం అర్ధం కావటం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X