Bhola Shankar: పవన్ కల్యాణ్ ఆరోపించిన అంశం మీదే చిరంజీవి 'భోళా శంకర్' సినిమా
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా థియేటర్లకు రానే వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 11న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ప్రీమియర్ షో నుంచే థియేటర్స్ వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే పవన్ కల్యాణ్ రేజ్ చేసిన పాయింట్ మీదే నడిచినట్లు తెలుస్తోంది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య ఫుల్ జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడో మరో హిట్ ను ఖాతాలో వేసుకోబోతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం భోళా శంకర్. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఈ మూవీని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను 80కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి నిర్మించినట్లు సమాచారం.

చిరు ఈ మధ్య అన్ని రీమేక్ సినిమాలపై పడినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఖైదీ నంబర్ 150, ఆ తర్వాత చేసిన గాడ్ ఫాదర్ సినిమాలు తమిళంలో తెరకెక్కిన సినిమాలకు రీమేక్. ఇప్పుడు భోళా శంకర్ సినిమా కూడా తమిళంలో అజిత్ నటించిన వేదాలం సినిమాకు రీమేక్. అయితే తెలుగు నెటివిటీకి తగ్గట్లుగా దానిని మార్చి.. భోళా శంకర్ గా తెరకెక్కించారు.
ఇక భోళా శంకర్ సినిమా ఈరోజు రిలీజ్ అయి.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే భోళా శంకర్ సినిమా ప్రారంభ సీన్.. పవన్ కల్యాణ్ రేజ్ చేసిన పాయింట్ మీదే ఉందని సినిమా చూస్తే అర్థం అవుతుంది. అయితే పవన్ కల్యాణ్... వైసీపీ పాలనలో భారీగా బాలికలు, మహిళల అదృశ్యం అయ్యారని పార్లమెంటు సాక్షిగా నిజాలు వెల్లడయ్యాయని అన్నారు. 2019-21 వరకు మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళల అదృశ్యం అయ్యారని ఆయన అప్పట్లో ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్ ట్వీట్ పై పెను దుమారం రేపింది. అయితే ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని భోళా శంకర్ సినిమాలో పెట్టారు. అయితే ఇక్కడ కలకత్తా అని చూపించారు. అమ్మాయిల మిస్సింగ్ పాయింట్ మాత్రం పవన్ రేజ్ చేసిన పాయింట్ కావడం విశేషం. అయితే బ్రో సినిమాలో శ్యాంబాబు డ్యాన్స్ ఎలా అయితే వివాదం సృష్టించిందో... మరి భోళా శంకర్ అమ్మాయి మిస్సింగ్ సీన్ ఏమైనా వివాదాలు సృష్టిస్తుందో లేదో చూడాలి ఇక.

మొత్తానికి భోళా శంకర్ సినిమా అయితే... ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా చిరంజీవికి హ్యాట్రిక్ ఇవ్వబోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా భాటియా నటించగా.. చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఇక సుశాంత్ ఈ సినిమాలో కీర్తి సురేష్ లవర్ గా కనిపించనున్నారు. చిరంజీవి ఎప్పటిలానే తన పాత్రలో అద్బుతంగా నటించారని అంటున్నారు. స్వర మహతి అందించిన మ్యూజిక్ బీజీఎమ్ బాగుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











