సెక్స్ రాకెట్లో...పట్టుబడ్డ మరో సినీతార
హైదరాబాద్: కారణాలేమైనా పలువురు సినీ తారలు, టీవీ నటులు ఈ మధ్య కాలంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ సందర్భాలు చూసాం. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లి ఏరియాలో పోలీసులు సెక్స్ రాకెట్ చేధించారు. ఈ ఘటనలో ఒక సినీ జూనియర్ ఆర్టిస్టుతో పాటు ఆరుగురు పురుషులు, మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేసారు.
కూకట్ పల్లి ఏరియా సుమిత్రానగర్‌లోని ఓ అపార్టుమెంటులో వ్యభిచారం జరుగుతుందన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆకస్మిక దాడి చేసి వ్యభిచార గృహం నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసారు. గత కొన్ని వారాలుగా ఇక్కడ వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

కూకట్‌పల్లి నివాసుడైన డి.సురేందర్, అతని స్నేహితుడు సుధీర్ కలిసి ఈ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడి సమయంలో నలుగురు విటులు కూడా పోలీసులకు చిక్కారు. పోలీసులు దాడిలో పట్టుబడ్డ 23 సంవత్సరాల జూనియర్ ఆర్టిస్టు శ్రీకాకుళంకు చెందిన వ్యక్తి. మరో ఇద్దరు అమ్మాయిల వయసు 20 ఏళ్లలోపే ఉంది. వారిని హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.


Click it and Unblock the Notifications