Don't Miss!
- News AP Nominations: రేపు లోకేష్, ఎల్లుండి చంద్రబాబు నామినేషన్లు..!
- Sports IPL 2024: రోహిత్ నుంచి దక్కని సహకారం.. ఒంటరైన హార్దిక్ పాండ్యా!
- Automobiles సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
- Finance Gautam Adani: గౌతమ్ అదానీ జీవితాన్ని మార్చిన లేడీ డెంటిస్ట్.. ఆమె ఎవరంటే..??
- Travel ఇండియాలోని సమ్మర్లో వెళ్లకూడని సందర్శనీయ ప్రదేశాలివే!
- Lifestyle Egg Dum Biryani : గుడ్డుతో రుచికరమైన దమ్ బిర్యానీ..ఒకసారి రుచి చూస్తే మొత్తం మీరే లాగించేస్తారు
- Technology Haier నుంచి నాలుగు కొత్త స్మార్ట్ టీవీలు! ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు
మగధీర విజయం వెనుక
'మగధీర" రామ్చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా గీతా ఆర్ట్స పతాకంపై రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సినిమాలో రణదేవ్ బిల్లాగా పాపులర్ అయిన దేవ్ గిల్ 'మగధీర" చిత్రం ద్వారా తనకు లభించిన విజయానందాన్ని ఈ విధంగా తెలియజేశారు. 'చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా పిచ్చి. పూణేలో శిక్షణ అనంతరం ముంబాయ్ వెళ్ళాను అప్పుడు మా నాన్న గారు ఒకటే చెప్పారు. 'చేసే పనిలో నిబద్ధత, క్రమశిక్షణ, హార్డ్ వర్క్ ఉంటే విజయం అదే వస్తుంది" అని.
ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి అందరూ కష్టపడ్డారు. రాజమౌళి సహాయ దర్శకుడు జగదీష్ నన్ను రాజమౌళి గారికి పరిచయం చేసారు. ఆడిషన్ అయిన తరువాత నాకు భాష రాకపోయినప్పటికీ రమా రాజమౌళి గారు చిన్న పిల్లాడిలా అన్నీ దగ్గరుండి నేర్పించారు. స్టార్ కొడుకు అయినప్పటికీ రామ్ చరణ్ చాలా ఫ్రెండ్లీగా ఉండే వారు. ఆయన పడే కష్టం చూసి ఇన్ స్పైర్ అయ్యి నేను కూడా మరింత కష్టపడ్డాను. ఒకసారి ఫైట్ చేస్తుండగా నా చేతి వేళ్ళు దెబ్బ తింటే పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతికి కట్టు కట్టారు రామ్చరణ్..పీటర్ హెయిన్స్ వియత్నాం నుంచి "టోనీ, శాంగ్ అనే ఇద్దరు సహాయకులను రప్పించారు. వారు రోజుకి ఆరు గంటలు చొప్పున వారం రోజులు శిక్షణ ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ నాలుగు వందల సంవత్సరాల క్రితం సెట్స్ అద్భుతంగా వేసారు. ఇక కీరవాణి గారైతే సినిమాకు ప్రాణం పోసారు. ఇలా అందరి కృషితో 'మగధీర" భారతదేశంలోనే కాక ప్రపంచా వ్యాప్తంగా గొప్ప విజయం సాధించింది. భాష తెలియకపోయినా ఇక్కడి మనుషుల మధ్యే వుండి నటించాలనుంది" అంటూ 'మగధీర" విజయం పట్ల తన సంతోషం వ్యక్తం చేశారు.