twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీర విజయం వెనుక

    By Staff
    |

    'మగధీర" రామ్‌చరణ్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా గీతా ఆర్ట్‌‌స పతాకంపై రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ నిర్మించి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సినిమాలో రణదేవ్‌ బిల్లాగా పాపులర్‌ అయిన దేవ్‌ గిల్‌ 'మగధీర" చిత్రం ద్వారా తనకు లభించిన విజయానందాన్ని ఈ విధంగా తెలియజేశారు. 'చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా పిచ్చి. పూణేలో శిక్షణ అనంతరం ముంబాయ్‌ వెళ్ళాను అప్పుడు మా నాన్న గారు ఒకటే చెప్పారు. 'చేసే పనిలో నిబద్ధత, క్రమశిక్షణ, హార్డ్‌ వర్క్‌ ఉంటే విజయం అదే వస్తుంది" అని.

    ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి అందరూ కష్టపడ్డారు. రాజమౌళి సహాయ దర్శకుడు జగదీష్‌ నన్ను రాజమౌళి గారికి పరిచయం చేసారు. ఆడిషన్‌ అయిన తరువాత నాకు భాష రాకపోయినప్పటికీ రమా రాజమౌళి గారు చిన్న పిల్లాడిలా అన్నీ దగ్గరుండి నేర్పించారు. స్టార్‌ కొడుకు అయినప్పటికీ రామ్‌ చరణ్‌ చాలా ఫ్రెండ్లీగా ఉండే వారు. ఆయన పడే కష్టం చూసి ఇన్‌ స్పైర్‌ అయ్యి నేను కూడా మరింత కష్టపడ్డాను. ఒకసారి ఫైట్‌ చేస్తుండగా నా చేతి వేళ్ళు దెబ్బ తింటే పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతికి కట్టు కట్టారు రామ్‌చరణ్‌..పీటర్‌ హెయిన్స్‌ వియత్నాం నుంచి "టోనీ, శాంగ్‌ అనే ఇద్దరు సహాయకులను రప్పించారు. వారు రోజుకి ఆరు గంటలు చొప్పున వారం రోజులు శిక్షణ ఇచ్చారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ నాలుగు వందల సంవత్సరాల క్రితం సెట్స్‌ అద్భుతంగా వేసారు. ఇక కీరవాణి గారైతే సినిమాకు ప్రాణం పోసారు. ఇలా అందరి కృషితో 'మగధీర" భారతదేశంలోనే కాక ప్రపంచా వ్యాప్తంగా గొప్ప విజయం సాధించింది. భాష తెలియకపోయినా ఇక్కడి మనుషుల మధ్యే వుండి నటించాలనుంది" అంటూ 'మగధీర" విజయం పట్ల తన సంతోషం వ్యక్తం చేశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X