ఆ అందానికి తన్మయంత్నమై..కాజల్ ప్రేమలో పడింది..!?

By Sindhu

'మగధీర" చిత్రంతో తెలుగులో తారాస్థాయికి దూసుకుపోయిన పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈ అమ్మడు ప్రస్తుతం ప్రేమలో పడిందంట. ఏ హీరోతోనో, ఏ డైరెక్టర్‌తోనో అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. తెలుగులో మహేష్‌ తో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బిజినెస్‌మెన్" చిత్రంలోనూ, అలాగే ఈ నెల 9న ప్రారంభమైన రామ్‌ చరణ్ చిత్రంలోనూ కథానాయికగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ తమిళంలో సూర్య కథానాయకుడిగా 'రంగం" ఫేమ్ కెవి ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మావూటన్" చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ రష్యాలోని అందమైన ప్రదేశాల్లో జరిగింది.

ఈ షూటింగ్‌లో రష్యాలోని చారివూతాత్మక కట్టడాల అందాలకు కాజల్ అగర్వాల్ ఫ్లాటైపోయి రష్యా నగరాన్ని ప్రేమించడం మొదలు పెట్టిందట. అంతే కాకుండా రష్యా అందాలని తన కెమెరాలో బంధించి మురిసిపోయిందట కాజల్. రష్యా టూర్ విశేషాలని కాజల్ వివరిస్తూ ' 'మావూటన్" చిత్రం షూటింగ్ కోసం రష్యా వెళ్ళాను. అక్కడి చారివూతాత్మక కట్టడాలు, రష్యా అందాలు నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. ఇక్కడి అందాలను చూసి ఈ ప్రదేశాన్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ఇంకా రష్యాలో నేను చూడాల్సిన ప్రదేశాలు చాలా వున్నాయి. షూటింగ్‌ల హడావిడి నుంచి కొంత విరామం దొరికితే మరోసారి రష్యా అందాలను ఆస్వాదించాలనుకుంటున్నా" అంటోంది ఈ ముద్దుగుమ్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X