నాకు పిల్లలు పుట్టాక అలా చేస్తా.. నాగ చైతన్య కామెంట్స్ తో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Naga Chaitanya - Sobhita: హీరోయిన్ సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్లకు నాగ చైతన్య - శోభిత ప్రేమలో పడి ఇద్దరు సీక్రెట్ గా డేటింగ్ చేశారు. ఈ విషయం మీడియా కంటపడ్డ అదేం లేదంటూ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇటీవల డిసెంబర్ 4న వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. అది కొద్ది మంది సమక్షంలో జరిగిన వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే.. శోభిత-చైతు ప్రేమ గురించి అధికారికంగా అందరికీ తెలిసిన తర్వాత వీరిద్దరూ పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ తరుణంలో నాగచైతన్య పెళ్లి, పిల్లలపై కామెంట్స్ చేశారు. దీంతో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఆ విషయాలు ఏమిటంటే?

దగ్గుబాటి రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న రానా టాక్ షో లో అక్కినేని నాగచైతన్య, శోభితాలో పాల్గొన్నారు. ఈ సమయంలో నాగచైతన్య మాట్లాడుతూ.. తన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తనకు ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు చాలని, చిన్నతనంలో తాను గడిపిన మధుర క్షణాలు అన్ని తిరిగి వాళ్లతో పొందాలని ఆశిస్తున్నానని తెలిపారు. ఇక ఆయన మాట్లాడుతూ జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటే విజయం సాధించినట్లే.. మామూలుగా ఒక సినిమా చేస్తాం .. అది బాగా ఆడుతుంది. కలెక్షన్ కూడా బాగా వస్తాయి. చాలా రోజులు ఆడుతుంది నా దృష్టిలో నిజమైన విజయం అది కాదు. మనం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే మన విజయం. అదే అసలైన విజయం. కుటుంబమే నా లైఫ్.. అది లేకుండా నా జీవితం లేదు అని అన్నారు.

The Rana Daggubati Show Naga Chaitanya Opens Up About children Family what happen with samantha

'నాకు 50 ఏళ్లు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా గడపాలని అనుకుంటున్నానగానే వెంకీ మామ లాగా ముగ్గురు, నలుగురు పిల్లలు కావాలని అడిగారు. అందుకో నాగచైతన్య నాకు ఒకరు లేదా ఇద్దరు చాలు.. వెంకీ మామ పెద్ద కుటుంబం. నాకు కొడుకు పుడితే వాడిని కారు రేస్ కు తీసుకెళ్తా .. కూతురు పుడితే.. తన ఎలాంటి అలవాట్లు ఉంటాయో దానికి తగ్గట్టుగా ఆమెను ప్రోత్సహిస్తా.. నాకు వాళ్లతో ఎక్కువ సమయం గడపాలని ఉంది. చిన్నతనంలో మనం ఎన్నో అద్భుతమైన క్షణాలను ఆస్వాదించాము. అలాంటి క్షణాలను వారితో కలిసి మళ్ళీ ఆస్వాదించాలని ఉంది' అని నాగచైతన్య పేర్కొన్నారు.

అయితే ఇంకా.. గతంలో నాగ చైతన్య - సమంత విడిపోయిన సమయంలో పలు రూమర్స్ వినిపించాయి. అలాంటి రూమర్స్ లో చైతన్య, అక్కినేని ఫ్యామిలీ పిల్లలు కావాలనుకుంటే సమంత పిల్లలు వద్దనుకుందని, ఇప్పుడే సమంతకు పిల్లలని కనడం ఇష్టం లేదనే రూమర్ వినిపించింది. కానీ, సమంత కూడా పలు ఇంటర్వ్యూలలో తనకు పిల్లలను కనాలని ఉందని, తాను మాతృత్వ భావనను ఆస్వాదించాలని భావిస్తున్నానంటూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ రెండు కామెంట్స్ బేస్ చేసుకుంటే నాగచైతన్య- సమంతలు విడిపోవడానికి పిల్లలు కన్నడం అనేది కారణం కానే కాదనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు విడిపోయారు కారణాలు తెలియదు. ఏది ఏమైనా సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభితతో ప్రేమలో పడి.. పెద్దలు ఒప్పించి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X