నన్నెవరూ బెదిరించలేరు, అలాంటివాటికి భయపడను: శింబు
చర్చనీయాంశ నటుల్లో శింబు ఒకరని చెప్పడంలో ఇసుమంత అతిశయోక్తి ఉండదు. ఆ మధ్య బీప్ సాంగ్ పాడి కేసులు, కోర్టులు అంటూ తిరిగిన ఈ హీరో తాజాగా అలాంటి వివాదాల్లోనే చిక్కుకున్నాడు
Recommended Video

పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ పన్ను విధానాలను ఎక్కుపెట్టి వైరముత్తు కొడుకు కపిలన్ రాసిన పాటను పాడారు. అందులో పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ పన్ను విధానంతో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను, ఆ విధానాలకు వ్యతిరేకంగా నటులు రజనీకాంత్, కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు పొందుపరచారు.

శింబుపై వ్యతిరేకత
ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట ఇప్పుడు కలకలాన్ని సృష్టిస్తోంది. దీంతో నటుడు శింబుపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందని, ఆయనకు బెదిరింపులు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. తనకు ఎవరి నుంచి ఎటువంటి బెదిరింపులు రాలేదని నటుడు శింబు పేర్కొన్నారు.

తాజాగా అలాంటి వివాదాల్లోనే
చర్చనీయాంశ నటుల్లో శింబు ఒకరని చెప్పడంలో ఇసుమంత అతిశయోక్తి ఉండదు. ఆ మధ్య బీప్ సాంగ్ పాడి కేసులు, కోర్టులు అంటూ తిరిగిన ఈ హీరో తాజాగా అలాంటి వివాదాల్లోనే చిక్కుకున్నాడు. ఈ విషయంపై నటుడు శింబు తన ట్విట్టర్ ద్వారా ఆదివారం వివరణ ఇచ్చాడు.

ఒక గాయకుడిగా తన బాధ్యత
పెద్ద నోట్లు రద్దు, జీఎస్‌టీ పన్ను విధానం లాంటి విషయాల్లో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను పాటలో పొందుపరచామని తెలిపాడు. అయితే ఈ పాటను రాసింది తాను కాదని, ఒక గాయకుడిగా తన బాధ్యతను మాత్రమే తాను నిర్వహించానని అన్నాడు. ఈ విషయంలో తనకెలాంటి బెదిరింపులు రాలేదని చెప్పాడు.

క్షమాపణ కోరుకుంటున్నాను
ఒక వేళ అలాంటివేవైన వచ్చినా వాటికి తాను భయపడనని అన్నాడు. ప్రజల నుంచి తనకు వ్యతిరేకత వ్యక్తం కాలేదని, అలా ఆ పాట ఎవరి మనసునైనా గాయపరిచినట్లు అయితే తాను క్షమాపణ కోరుకుంటున్నానని శింబు పేర్కొన్నాడు. అయినా గతం లో చేసిన పనులకంటే పేద్ద ఘోరమా ఇది? వాటికే భయపడని శింబు ఇప్పుడు ఈ సంఘటనలకు భయపడతాడా??


Click it and Unblock the Notifications











