‘సైరా’ రచయితలను వెంటేసుకుని వెళ్లిన చిరంజీవి.. కారణం అదేనా?
Recommended Video

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' మూవీ షూటింగులో బిజీగా గడుపుతున్నారు. తీరికలేని షూటింగ్ వల్ల ఆయన కొన్ని కార్యక్రమాలను వాయిదా వసుకోవడం, రద్దు చేసుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. మరి అంత బిజీగా ఉండే మెగాస్టార్ తాజాగా... పని కట్టుకుని, రచయితలను వెంటేసుకుని 'మణికర్ణిక' మూవీ చూడటానికి వెళ్లడం చర్చనీయాంశం అయింది.
చిరంజీవితో పాటు 'సైరా నరసింహారెడ్డి' చిత్ర రచయితలు పరుచూరి బ్రదర్స్, మరికొందరు సహరచయితలతో కలిసి... మహేష్ బాబుకు చెందిన 'ఎఎంబి సినిమాస్'లో ఈ సినిమా చూశారు. అయితే అందరూ కలిసి ఈ సినిమాకు వెళ్లడం వెనక ఓ కారణం ఉందని తెలుస్తోంది.

ఏవైనా పోలికలు ఉన్నాయో పరిశీలించేందుకేనా?
‘మణికర్ణిక' చిత్రం ఝాన్సీ రాణి లక్ష్మీ భాయి జీవితం ఆధారంగా తెరెక్కింది. ఆమె బ్రిటిష్ వారిపై పోరాటం చేసి వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ‘సైరా' చిత్రం కూడా బ్రిటిష్ వారిపై పోరాటం నేపథ్యంలోనే సాగుతుంది కాబట్టి తమ సినిమాతో ఏమైనా పోలికలు ఉన్నాయా? అనే విషయం పరిశీలించేందుకు చిరంజీవి, రచయితలు కలిసి వెళ్లారట.

రెండు కథలూ ఒకే కాలం నాటివి...
ఊయ్యాలవాడ నరసింహారెడ్డి కథ, రాణి లక్ష్మీభాయి కథ దాదాపు ఒకే కాలానికి చెందినవి. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు దాడి చేసిన నరసింహారెడ్డిని బంధించి 1847 ఫిబ్రవరి 22న ఉరితీశారు. 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత రాణి లక్ష్మీభాయి బ్రిటిష్ వారితో యుద్ధం చేసి మరణించారు.

సైరా నరసింహారెడ్డి
కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

భారీ తారాగణం
తెలుగులో బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇదే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి స్టార్స్ సైతం ఇందులో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











