చిరు ఇంత షాక్ ఇచ్చాడేంటి?: 'సైరా' సంగతేమైంది!.. అసలేం జరుగుతోంది..
Recommended Video

గాసిప్ పుట్టడానికి 'గడ్డం' మేటర్ చాలు అన్నట్లు తయారైంది పరిస్థితి. ఏం చేసినా సినిమా కోసమే అని ముడిపెట్టి మాట్లాడేయడం సినీ వర్గాల్లో కొత్తేమి కాదు. మెగాస్టార్ చిరంజీవి గడ్డానికి, సైరా సినిమాకు ముడిపెట్టిన ఓ వార్త ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది. అందులో నిజనిజాలెంతో తెలియదు గానీ.. ఆ సంగతేంటో ఒకసారి లుక్కేద్దాం..

క్లీన్ షేవ్‌లో చిరు..:
కొత్త సంవత్సరం సందర్భంగా 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా సహా పలువురు చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోల్లో చిరు క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నారు.

ఆ ఫోటోలోనూ..:
నటుడు పొట్టి వీరయ్య కూడా చిరును కలిసి తనకు ఆర్థిక సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఆర్థిక సహాయం చేసినందుకు చిరంజీవి ఇంటికి వెళ్లి స్వయంగా కలిసి వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వీరిద్దరు దిగిన ఫోటో బయటకు వచ్చింది. ఇందులోనూ చిరు క్లీన్ షేవ్‌తో కనిపించారు.

సడెన్‌గా.. ఇదేంటిలా:
'సైరా' సినిమా కోసం ఫుల్లుగా గడ్డం పెంచేసి నిన్న మొన్నటిదాకా గుబురు గడ్డంతో కనిపించిన చిరు.. సడెన్‌గా ఇలా క్లీన్ షేవ్‌లో కనిపించారేంటబ్బా? అన్న సందేహం ఇప్పుడు చాలామందికి కలుగుతోంది.

షూటింగ్ నిలిపేశారా?
అసలే సైరా సినిమాపై లేనిపోని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న తరుణంలో.. చిరు ఇలా క్లీన్ షేవ్ లో దర్శనమివ్వడంతో.. కొంపదీసి షూటింగ్ కొన్నాళ్ల పాటు రద్దు చేశారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అలా ఏమైనా?:
చిరు క్లీన్ షేవ్‌పై నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ.. ఓ పాజిటివ్ ప్రచారం కూడా జరుగుతోంది. కథానుగుణంగా గడ్డం లేకుండా చిరును చూపించే సన్నివేశాలేమైనా ఉండొచ్చు అంటున్నారు. అందుకే చిరు ఇలా క్లీన్ షేవ్ లో దర్శనమిచ్చారన్న టాక్ వినిపిస్తోంది. అయితే నిజాలేంటన్నది మాత్రం చిత్ర యూనిట్ కే తెలియాలి.

క్లారిటీ ఇస్తారా?:
నిజానికి సైరా సినిమాపై ఇప్పటికే చాలా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు సురేందర్ రెడ్డిపై చిరు అసంతృప్తిగా ఉన్నాడని.. సినిమాపై గుణశేఖర్ తోనూ చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జోరందుకుంది.
ఇలాంటి సమయంలో చిరు క్లీన్ షేవ్ తో దర్శనమివ్వడంతో.. షూటింగ్ నిలిపేశారని, భారీ మార్పులు చేయబోతున్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తుందో లేదో!


Click it and Unblock the Notifications











