మెగా నిర్మాత ఎమ్.ఎస్.రాజు సినిమాలు తగ్గించిన కారణం
రోజు రోజుకీ పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్...దాంతో పాటే పెరుగుతున్న విపరీతమైన బడ్జెట్టు చూసి మేం చాలా వర్రీ అవుతున్నాం...అందుకునే మాకు వేరే దారి లేక స్లో అయ్యాం అంటున్నారు మెగా ప్రొడ్యూసర్ గా పేరు గాంచిన ఎమ్.ఎస్.రాజు. ఆయన్ని మీరు సినిమాలు నిర్మించటం బాగా తగ్గించారే అన్న ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు. అలాగే మాకు పర్శనల్ గా కొత్త నటీ నటులను, టెక్నీషియన్స్ ను ఎంకరేజ్ చేయటం ఇష్టం. అంతేగాదు...ఇక నుంచి నా సినిమాలు ఇరవై నుంచి ఇరవై ఐదు నిముషాలు పాటు లెంగ్త్ తగ్గించాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే...ఎంతో ఖర్చుపెట్టి తీసిన పాటలు, యాక్షన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు జనం బయిటకు వెళ్ళిపోతున్నారు. మరి ఒక్కడు, వర్షంలో పాటలు, యాక్షన్ సీక్వెన్స్ మెయిన్ కదా అంటే...ఆ సినిమాలు తీసు ఆరేళ్ళు అయింది. అప్పటికీ ఇప్పటికీ పరిస్ధితులు మారిపోయాయి. ఇప్పటి యంగ్ జనరేషన్ ఆడియన్స్ చాలా స్మార్ట్ అయ్యారు. వాళ్ళను కూర్చోపెట్టాలంటే టైట్ గా ఉండే స్క్రీన్ ప్లే నేరేషన్ తప్ప వేరే దారి లేదు అని తన అభిప్రాయాలను వ్యక్తీ కరించారు. ప్రస్తుతం ఎమ్.ఎస్.రాజు తన కుమారుడుని హీరోగా పరిచయం చేస్తూ వియన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











