విజయనిర్మలకు జయసుధ రిలేటివ్.. ఆ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇదే

సినీ నటి, దర్శకురాలు విజయ నిర్మల ఈ రోజు (జూన్ 27) తెల్లవారు జామున మృతి చెందారు. ఆమె ఆకస్మిక మరణం యావత్ సినీ లోకాన్ని కలచి వేసింది. ఈమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ తమ ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నారు. నిన్న (బుధవారం) రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గుండె పోటుతో మరణించారు.

అయితే సీనియర్ నటి జయసుధతో విజయనిర్మలకు ప్రత్యేక అనుభందం ఉందని తెలుస్తోంది. ఇన్నాళ్లు ఎవ్వరికీ తెలియని ఈ విషయం విజయనిర్మల మరణం తర్వాత బయటకు వచ్చింది. జయసుధకు విజయనిర్మల పిన్ని అవుతుందని తెలిసింది. అందుకే విజయనిర్మల ఇంట్లో జరిగిన ప్రతీ ఫంక్షన్‌, ఆమె సంబందించిన అన్ని ఈవెంట్లలో జయసుధ పాల్గొనేది.

The Relation Between Jayasudha and Vijaya Nirmala

బాల నటిగా 'పాండురంగ మహత్యం' అనే సినిమా ద్వారా సినీ ఆరంగేట్రం చేసిన విజయనిర్మల ఆపై 200లకు పైగా చిత్రాల్లో నటించింది. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఆమె 50 కి పైగా చిత్రాల్లో నటించింది. అదేవిధంగా దర్శకురాలిగా కూడా రాణించిన విజయనిర్మల దాదాపు 47 చిత్రాలకు దర్శకత్వం వహించింది. 2002 సంవత్సరం అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకుంది. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన నటి విజయనిర్మల మరణ వార్తను జీర్ణించుకోలేక పోతోంది టాలీవుడ్ ఇండస్ట్రీ.

విజయ నిర్మల భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్థం ఆమె స్వగృహానికి తీసుకు వచ్చారు. ఈ రోజంతా అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలింఛాంబర్‌కు తరలించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం విజయ నిర్మల అంత్యక్రియలు చిలుకూరులో గల ఆమె ఫామ్ హౌస్‌లో జరుగుతాయని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X