సంక్రాంతికి సై అంటున్న మహేష్, వెంకటేష్, బాలయ్య..!
టాలీవుడ్ లో సంక్రాంతి యుద్ధం ఈ సారి మరింత రంజుగా ఉండబోతుంది. గత పది ఏళ్ల నుంచి సంక్రాంతి సందడి తగ్గింది. అయితే వచ్చే సంక్రాంతి మాత్రం రెట్టించిన ఉత్సాహంతో సినీ జనాన్ని ఖుషీ చేయబోతుంది. సంక్రాంతి కి పెద్ద హీరోల సినిమాలు ఉంది చాలా ఏళ్లు అయ్యింది. 2012 సంక్రాంతి కి మాత్రం ముగ్గురు అగ్ర హీరోలు రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపు దిద్దుకుంటున్న బిజినెస్ మెన్ సంక్రాంతి రిలీజ్ కు సిద్ధమయిపోయింది. బాలకృష్ణ శ్రీరామరాజ్యం నవంబర్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ జనవరిలో అధినాయకుడుగా జనం ముందుకు రాబోతున్నాడు. ఇక వెంకటేష్ బాడీ గార్డ్ కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు.
వీరే కాకుండా గుణశేఖర్ దర్శకత్వంలో వైవిఎస్ చౌదరి నిర్మిస్తున్న రవితేజ నిప్పు కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది. సంక్రాంతికి సినిమా వసూళ్లు ఏలా ఉంటాయన్నది బాలయ్యకు తెలిసిందే. ఆయన నరసింహనాయుడు, పెద్దన్నయ్య, లక్ష్మి నరసింహ వంటి హిట్ సినిమాలు చాలా వరకు హిట్ అయినవి ఆ టైం లోనివే. మహేష్ కు మాత్రం నిజంతో కాస్త చేదు అనుభవం సంక్రాంతికి ఉంది. అయితే ఈ సంక్రాంతికి మాత్రం బిజినెస్ మ్యాన్ హిట్ కొడతాడనే దూకుడు మీద ఉన్నారు యూనిట్.


Click it and Unblock the Notifications











