చిరు ఇమేజ్ క్యాష్?

అలాగే జగపతిబాబు, నా కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. గతంలో వచ్చిన 'శివరామరాజు" ఇప్పుడు 'అధినేత" రెండూ ఘనవిజయం సాధించడంతో మా కాంబినేషన్ సూపర్‌హిట్ అయింది. ఈ సంవత్సరం ఇంతవరకూ విడుదలైన చిత్రాలో 'అరుంధతి, అధినేత" సూపర్‌హిట్ చిత్రాలుగా నిలిచి 'అ" సెంటిమెంటు అదిరిపోయింది. అలాగే ఈ సినిమా చూసినవారంతా ఎన్నికలకు ముందు విడుదలై ఉంటే చాలా బాగుండేది. ఒక్కపార్టీ అయినా సినిమాలోని మేనిఫెస్టో ఫాలో అయితే ప్రజలకు మేలు జరిగేది అంటున్నారు.
'అధినేత" చూపించిన విధంగానే మే 16న ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని అంతా అంటున్నారు. నా చిత్రాలన్నింటిలో ఏదో ఒక సందేశం ఉంటుంది. నా తదుపరి చిత్రం 'సేవకుడు" సమాజాన్ని ఆలోచింపచేసే విధంగా ఉంటుంది"" అన్నారు. అయితే ఈ సమయంలో గతంలో పరుచూరి వారు తమ అదినాయుకుడు..అధినేత వేరు వేరు అని ప్రకటించటం గుర్తు చేసుకోవాల్సి న విషయం. ఇక చిరంజీవి అభిమానులన్నా..తమ హీరోకి చేసిన స్క్రిప్టు కదా అని వెళ్ళి చూస్తారేమో అన్న భ్రమతో ఇలా సముద్ర స్టేట్ మెంట్స్ ఇస్తున్నారని అంతా అంటున్నారు.


Click it and Unblock the Notifications











