విద్యాబాలన్ గొంతులో సిల్క్ మత్తు ఉందా?
డర్డీ పిక్చర్ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను పోషించిన విద్యాబాలన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె బోల్డ్ నటనను చూసి అందరూ వెర్రెత్తిపోతున్నట్లే కనిపిస్తున్నా దక్షిణాది పాఠకులను ఆమె గొంతు ఆకట్టుకుంటుందా అనేది అనుమానంగానే ఉంది. సిల్క్ స్మిత గొంతులో పలికిన మత్తు, మగవాళ్లను వెర్రెత్తించే విరుపులు విద్యాబాలన్ గొంతులో పలికిందా అనే సందేహం వ్యక్తమవుతోంది. అది సాధ్యమయ్యే పని కాదని అంటున్నారు. విద్యాబాలన్ గొంతులో ఆ సిల్క్ రాలేదనే అంటున్నారు. ఈ విషయంలో హేమమాలిన బెట్టర్ అని అంటున్నారు. 59 ఏళ్ల హేమమాలిన వాయిస్ సిల్క్ స్మిత వాయిస్‌కు యాభై శాతం సరిపోతుందని అంటున్నారు.
కాగా, సిల్క్ స్మితను వెర్రిగా అభిమానించిన దక్షిణాది పాఠకులకు విద్యాబాలన్ నచ్చుతుందనేది ఇప్పుడే చెప్పలేం. నీరు గడ్డ కట్టే చలిలోనూ మగవాళ్లలో వేడి పుట్టించే అంగాంగ సౌందర్యం సిల్క్ స్మితది. ఆ వాయిస్ మరింత మత్తులోకి తీసుకుని వెళ్తుంది. ఆ విషయం సిల్క్ స్మితకు కూడా తెలుసు కాబట్టే అంతగా ఆమె ప్రేక్షకులకు దగ్గరైంది.


Click it and Unblock the Notifications











