జూ ఎన్టీఆర్ 'శక్తి' వెనక అసలు కథేమిటి?
అఖిల చరాచరాలలో అణువణువై అలరారుతున్న అనంత శక్తి ఆదిపరాశక్తి. ఆ జగన్మాత గురించి ప్రతి ఒక్కరూ తలచుకొనేలా ఉంటుందీ కథ. మన భారతావనిని కాపాడుతున్నది ఆ శక్తే. అష్టాదశ శక్తి పీఠాల విశిష్టతను కథలో ప్రభావశీలంగా మేళవించారు దర్శకుడు అన్నారు అశ్వనీదత్. ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి గురించి మీడియాతో మాట్లూడుతూ...శక్తి వెనక ఉన్న అసలు కథ అంటూ ఈ విషయం చెప్పారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ వచ్చిన టాప్-20 చిత్రాల్లో ఇదొకటిగా నిలబడుతుందన్న నమ్మకం నాకుంది అన్నారు. ఇక ఎన్టీఆర్ పాత్ర గురించి చెబుతూ...కథలో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఎన్టీఆర్ ఎలాంటి ఎమోషన్ అయినా అలవోకగా పలికించగలరు. ఇందులో నాలుగు రకాల భావోద్వేగాల్ని ప్రధానంగా చూపించారు. ఆయన పాత్ర గురించి ఇప్పుడు నేను చెప్పటం కంటే... తెరపై చూస్తేనే బాగుంటుంది.
మా శక్తి తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలుస్తుంది. ఎన్టీఆర్ శక్తిసామర్థ్యాలు ఏమిటో తెలుస్తాయి అన్నారు.ఈ చిత్రం కథ శక్తి పీఠాల నేపధ్యంలో సాగుతుంది అన్నారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహమణ్యం ఈ చిత్రంలో శక్తి పీఠాల ప్రాశస్త్యం గురించి వివరిస్తారని చెప్పారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న 52వ చిత్రం 'శక్తి'. ఎన్టీఆర్ హీరోగా గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం ఈ నెల 30 ప్రేక్షకుల ముందుకొస్తోంది.


Click it and Unblock the Notifications











