వర్మా ...ఇది రక్షా..కక్షా?

యండమూరి వీరేంద్రనాథ్ నవల 'తులసీదళం' అప్పట్లోనే నాపై ప్రభావం చూపింది. ఆమధ్య ముంబైలో ఇండియా టీవీ చానల్‌లో చేతబడులపై వచ్చిన ఓ ప్రోగ్రామ్‌ని చూస్తున్నప్పుడు చేతబడి మీద ఓ సినిమా ఎందుకు తీయకూడదనే ఆలోచన వచ్చింది. అలా 'ఫూంక్' వచ్చింది. ఇదే కథ మరో భిన్నమైన స్క్రీన్‌ప్లేతో తెలుగులో 'రక్ష'గా వస్తోంది. ఇందులో జగపతిబాబు నాస్తికుడు. తన కూతురికి ఏదో జరుగుతుంటే, దాన్నందరూ చేతబడి అని చెబుతుంటే, డాక్టర్లు దానికి సరైన విశ్లేషణ ఇవ్వలేకపోతుంటే, అతను ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యాడనేది కథ.
ఇక 'ఫూంక్'ని తెలుగులో డబ్ చేయకుండా, రీమేక్ చేయడానికి కారణం చెప్తూ...వంశీకృష్ణ తయారు చేసిన స్క్రీన్‌ప్లేనే దానికి కారణం. 'ఫూంక్' కథని మేమిద్దరం కలిసి డెవలప్ చేశాం. కానీ 'ఫూంక్' స్క్రీన్‌ప్లేకీ, 'రక్ష' స్క్రీన్‌ప్లేకీ చాలా తేడా వుంది. 'రక్ష' స్క్రీన్‌ప్లే పూర్తిగా వంశీకృష్ణ సొంతం. రెండింటి కథ ఒకటే గానీ, ట్రీట్‌మెంట్‌పరంగా రెండింటికీ చాలా తేడా వుంది. నిజం చెప్పాలంటే నా వెర్షన్ కంటే వంశీ వెర్షనే నాకు ఎక్కువగా నచ్చింది. ఎక్కువమంది జనం నమ్మే అంశాన్ని ఆధారం చేసుకుని అతను స్క్రీన్‌ప్లే అల్లుకున్నాడు. పరమ నాస్తికుడు తన సొంత అనుభవంతో పరమ భక్తుడిగా ఎలా మారాడనే అంశాన్ని అతను చాలా ఆసక్తికరంగా చిత్రీకరించాడు అన్నారు. ఇక జడ్ త్రి పిక్చర్స్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో కక్షా...రక్షా అన్నది తేలాలంటే రిలీజ్ దాకా ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











