ప్రిన్స్ మహేష్ బాబు ఖలేజా స్టోరీ ఇదేనా...?
మొన్నటివరకు కొమరం పులి చుట్టూ తిరిగిన ఇండస్ట్రీ అది ఫట్ అని అనడంతో ప్రస్తుతం టాలీవుట్ అంతా మహేష్ బాబు ఖలేజా చుట్టూ తిరుగుతుంది. ఖలేజా చిత్రానికి కూడా నిర్మాత నిర్మాత శింగనమల రమేష్ కాబట్టి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ యితే తప్ప పెట్టిన పెట్టుబడి మొత్తం రాని పరిస్తితిలో ఆయన ఉన్నారు. ఇటువంటి సమయంలో ఈ సినిమాకి కూడా బాగా హైప్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు సినిమా యూనిట్ వాళ్శు. దీనిలో భాగంగానే ఖలేజా సినిమా స్టోరీని లీక్ చేయడం జరిగింది. ఈ లీకయిన స్టోరీ ప్రకారం ఈ సినిమా మూడు సినిమా కథలతో రూపోందినదని సినీ వర్గాల భోగట్టా. పోకిరి, ఒక్కడు, అనుకోకుండా ఒకరోజు ఈ మూడు సినిమాల కథను ఆధారం చేసుకోని ఉంటుందని సమాచారం.
రాజస్థాన్ రౌడీలు హీరోయిన్ తరుముతున్న సమయంలో ఆటోడ్రైవర్ అయిన మహేష్ బాబు ఆమెను కాపాడి ఓ గ్రామంలోకి అడుగుపెడతాడు. అప్పటికే ఆ గ్రామం అష్టకష్టాలతో, రౌడీలచేతిలో దారుణంగా ఇబ్బందులకు గురిఅవుతూ ఉంటుందంట. అది గమనించిన ఓ స్వామిజీ ఈ గ్రామానికి ఒకరోజు ఓ వ్యక్తి వస్తాడు. అతని వల్ల ఈ గ్రామానికి ఉన్న అన్ని ఇబ్బందులు తోలగిపోతాయని చెబుతాడట. స్వామిజీ మాట ప్రకారం హీరోయిన్ ను తీసుకొని అనుకోకుండా ఆ గ్రామంలోకి అడుగుపెడతాడంట. ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న అన్ని కష్టాలు తోలగిపోతాయంట. అలాంటి సమయంలో ఒకరోజు అనుకోకుండా హీరోయిన్ ను దుండగులు ఎవరో తీసుకోనివెళతారంట. దీనితర్వాత మిస్ అయిన హీరోయిన్ ను ప్రిన్స్ మహేష్ బాబు ఎలా కాపాడాడు మరియు ఆ గ్రామంలో ఉన్న ఇబ్బందులు ఎలా తోలగిపోతాయని కధాంశంతో రూపోందిందనేది సమాచారం. ఈ నెల 30న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని బట్టి ప్రిన్స్ మహేష్ ఖలేజా స్టోరీ ఇదేనని ఫిలిమ్ వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications











