మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కి రెడీ అవుతున్న ఎన్టీఆర్-వినాయక్...!?
జూ ఎన్టీఆర్ కి పౌరాణికాలంటే బాగా ఇష్టం. తన తాత ఎన్టీఆర్ పోషించిన పలు పాత్రలని తానూ చేయాలని ఉబలాటపడుతుంటాడు. అలా చేయాలంటే తాత సినిమాలని కొన్నిటిని రీమేక్ చేయాలి. అలా జూనియర్ ఎన్టీఆర్ రీమేక్ చేయాలనుకుంటున్న సినిమాలలో ఒకటి 'దాన వీర శూర కర్ణ'. విచిత్రంగా ఈ సినిమా దర్శకుడు వి.వి.వినాయక్ కి కూడా ఎంతో ఇష్టం. జూ ఎన్టీఆర్ తో దీనిని రీమేక్ చేయాలని తనూ ఆశ పడుతున్నాడు.
ఇది జూ ఎన్టీఆర్ కి సరిగ్గా సూట్ అయ్యే సినిమా అవుతుందని ఆయన అభిప్రాయం. ఈమధ్య దీనికి సంబంధించిన చర్చలు ఇద్దరి మధ్యా ఎక్కువగా జరుగుతున్నాయట. ఎప్పుడో కాకుండా త్వరలోనే దీనిని చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమా ఇప్పుడు చేయాలంటే చాలా పెద్ద బడ్జెట్ అవుతుంది. భారీ సెట్లు ఎన్నో అవసరమవుతాయి. గ్రాఫిక్స్ కూడా చాలా ఖర్చయ్యేపనే. అయినా జూ ఎన్టీఆర్ వంటి హీరోతో చేస్తే కనుక వర్కౌట్ అవడానికి ఆస్కారముంది.
jr ntr vv vinayak adurs badrinath allu arjun జూ ఎన్టీఆర్ వివి వినాయక్ అదుర్స్ బద్రినాథ్ అల్లు అర్జున్


Click it and Unblock the Notifications