మహేష్ బాబు సిటీలో లేకున్నా....

By Srikanya

హైదరాబాద్ : హీరో మహేష్ బాబు హైదరాబాద్ లో లేరు. ఆయన ఆగడు షూటింగ్ నిమిత్తం సిజ్జర్ లాండ్ వెళ్లారు. అయినా తన కుటుంబ వివరాలను తన సహాయకుల ద్వారా ఎన్యుమరేట్లకు అంద చేసారు. అలాగే...అల్లు అరవింద్ కుటుంబంతో పాటు దగ్గుబాటి రామానాయుడు కుటుంబం కూడా ఈ సర్వేలో పాల్గొని వివరాలు ఇచ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ ఈ సర్వేలో పాల్గొనలేదు. ఆయన ప్రస్తుతం హాలిడే నిమిత్తం బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. ఇక కృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మాజీ ఎమ్మల్యే, సినీ నటి జయసుధ, తనికెళ్ల భరిణి, హీరో శ్రీకాంత్ తమ వివరాలు అందించి సర్వేకు సహకరించారు.

అలాగే కేంద్రమంత్రి దాసరి నారాయణరావు మాత్రం సర్వే సందర్బంగా కులం వివరాలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఎన్యుమరేటర్లు ఆయనను కమ్యూనిటీ వివరాలు అడగగా ఆ వివరాల ఇచ్చేందుకు తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదంతా ముఖ్యం కాదని, ఆ కాలమ్ వదిలేయాలని దాసరి ఎన్యుమరేట్లను సూచించినట్లు సమాచారం.

The surveyors came to Mahesh Babu’s house and got details

కాగా పవన్ కళ్యాణ్ విషయమై కేసీఆర్ మాట్లాడుతూ... పవన్‌ కళ్యాణ్‌ ఇక్కడుండాలనుకోవడం లేదేమో అని విమర్శించారు. సమగ్ర కుటుంబ సర్వే కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైందని, ప్రజలు మహాద్భుతాన్ని ఆవిష్కరించారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మంగళవారం రోజంతా సర్వే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ గడిపిన ఆయన సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబ సమేతంగా వివరాలు ఇవ్వడం ఫేస్‌బుక్‌లో చూశానని అన్నారు.

కేసీఆర్ మాట్లాడుతూ... పవన్‌ కళ్యాణ్‌ సర్వేను తిరస్కరించారని ఒక విలేకరి చెప్పగా, ఆయన ఇక్కడ ఉండాలనుకోవడం లేదేమోనని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. టూరిస్టుల మాదిరిగా ఉండి, వెళ్లాలనే ఉద్దేశంతోనే సర్వేలో పాల్గొని ఉండకపోవచ్చని అన్నారు. ఇక్కడ నివసిస్తూ... తాగునీరు, లైట్లు, రోడ్లు తదితర ప్రభుత్వ సౌకర్యాలను వాడుకుంటూ ప్రభుత్వసర్వేలో పాల్గొనేందుకు నిరాకరించడం సామాజిక నేరం.. అని కేసీఆర్‌ విమర్శించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X